Published On:

NTRNeel: ఇది ‘వార్‌ 2’ టైమ్‌ – మా మిస్సైల్‌ తర్వాత వస్తుంది – ఎన్టీఆర్‌నీల్‌ మేకర్స్‌ షాకింగ్‌ ట్వీట్

NTRNeel: ఇది ‘వార్‌ 2’ టైమ్‌ – మా మిస్సైల్‌ తర్వాత వస్తుంది – ఎన్టీఆర్‌నీల్‌ మేకర్స్‌ షాకింగ్‌ ట్వీట్

Mythri Movie Makers Tweet About NTR Birthday and War 2 Update: ఎన్టీఆర్‌ బర్త్‌డే కోసం అభిమానులంత సిద్దమవుతున్నారు. ఆ రోజున వచ్చే మూవీ అప్‌డేట్స్‌ ఏ రేంజ్‌లో ఉండబోతున్నాయా అని అంచనాల్లో మునిగితేలుతున్నాయి. ఇప్పటికే ‘వార్‌ 2’ టీం నందమూరి ఫ్యాన్స్‌కి అదిరిపోయే ట్రీట్ రెడీ చేసి పెట్టిందని బాలీవుడ్‌ స్టార్‌ హీరో హృతిక్ రోషన్ హింట్‌ ఇచ్చేసాడు. ఇక నెక్ట్స్‌ ప్రశాంత్‌ నీల్‌ మూవీ వంతు ఉంది అని, దానికి సంబంధించిన మూవీ టీం ఎలాంటి సర్‌ప్రైజ్‌ ఇవ్వబోతుందారి ఆశగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కి మైత్రీ మూవీ మేకర్స్‌ షాకిచ్చింది.

 

ఈసారిగా వార్ 2తో సరిపెట్టుకోండి అంటూ ఫ్యాన్స్‌ని డిసప్పాయింట్‌ చేసింది. ఇంతకి మేకర్స్‌ ఏం చెప్పారంటే.. “ఇది పూర్తిగా వార్ 2 టైం.. మేం ఈ సినిమాను గౌరవిస్తున్నాం. మన మారణహోమాన్ని ప్రారంభించే ముందు. ‘వార్ 2’ను సెలబ్రేట్ చేసుకుందాం. మన మాస్ మిస్సైల్‌ను సరైన టైంలో వదులుదాం. ఈ పుట్టిన రోజును ‘వార్ 2’తో సెలబ్రేట్‌ చేసుకోండి” అంటూ ఫ్యాన్స్‌ని ఉద్దేశిస్తూ ట్వీట్‌ చేసింది. మే 20న ఎన్టీఆర్‌ప్రశాంత్‌ నీల్‌ (NTRNeel) మూవీ ఎలాంటి అప్‌డేట్‌ రాదని స్పస్టం చేసింది. ఇది చూసి ఫ్యాన్స్‌ అంతా నిరాశ వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఫస్ట్‌లుక్‌ లేదా టైటిల్‌ అయిన ఇవ్వండి అంటూ మూవీ టీంని రిక్వెస్ట్‌ చేస్తున్నారు ఫ్యాన్స్‌. అభిమానుల విజ్ఞప్తి మేరకు మేకర్స్‌ ఫస్ట్‌లుక్‌ అయినా ఇస్తారా? లేదా? చూడాలి.

 

కాగా అనౌన్స్‌మెంట్‌తోనే ఎన్టీఆర్‌, ప్రశాంత్‌ నీల్‌ మూవీ ఓ రేంజ్‌ బజ్‌ నెలకొంది. కేజీయఫ్‌, సలార్‌ వంటి బ్లాక్‌బస్టర్‌ చిత్రాల తర్వాత ప్రశాంత్‌ నీల్‌ నుంచి వస్తున్న సినిమా ఇది. దీంతో మూవీపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఇటీవల సెట్స్‌పైకి వచ్చిన ఈ సినిమా రెండు షెడ్యూల్‌ షూటింగ్‌ని జరుపుకుంది. రామోజీ ఫిలిం సిటీలో ఈ మూవీ షూటింగ్ మొదలైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత హైదరాబాద్‌ శివారులో వేసిన ప్రత్యేక సెట్‌లో ఈ చిత్ర షూటింగ్‌ జరుగనుంది. ఇక ఈ బర్త్‌డే వార్‌ 2, ఎన్టీఆర్‌నీల్‌ చిత్రాల నుంచి రెండు సర్‌ప్రైజ్‌లు వస్తాయని సంబరపడ్డ ఫ్యాన్స్‌ని మూవీ టీం నిరాశ పరిచింది.