Published On:

YSRCP: మాజీ సీఎం జగన్‌కు మరో బిగ్ షాక్.. వైసీపీ ఎమ్మెల్సీ రాజీనామా

YSRCP: మాజీ సీఎం జగన్‌కు మరో బిగ్ షాక్.. వైసీపీ ఎమ్మెల్సీ రాజీనామా

YSRCP MLC Zakia Khan Resigns: వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. ఏపీ శాసన మండలి డిప్యూటీ చైర్ పర్సన్ జకియా ఖానం పార్టీకి రాజీనామా చేశారు. అంతేకాకుండా ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేస్తూ మండలి చైర్మన్‌కు లేఖను పంపారు. ఇందిలా ఉండగా, అంతకుముందు 2020 జులైలో ఎమ్మెల్సీగా జకియా ఖానంను గవర్నర్ నామినేట్ చేసిన సంగతి తెలిసిందే.

 

అన్నమయ్య జిల్లా రాయచోటికి చెందిన ఆమె.. రెండేళ్ల నుంచి వైసీపీలో అసంతృప్తిగా ఉన్నారు. కాగా, ఆమెతో కలిపి ఇప్పటివరకు వైసీపీకి ఆరుగురు ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు. ఇప్పటికే కర్రి పద్మశ్రీ, జయమంగళ వెంకటరమణ, పోతుల సునీత, మర్రి రాజశేఖర్, బల్లి కల్యాణ్ చక్రవర్తిలు రాజీనామా చేశారు.

 

ఇదిలా ఉండగా, జకియా ఖానం నేరుగా విజయవాడలోని బీజేపీ కార్యాలయానికి వెళ్లారు. ఈ మేరకు బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వర సమక్షంలో బీజేపీలో చేరారు. అనంతరం ఆమెకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. కాగా, ఆమె ఉదయమే ఎమ్మెల్సీ పదవితో పాటు వైసీపీకి రాజీనామా చేశారు.

 

జకియా ఖానం బీజేపీలో చేరడం సంతోషంగా ఉందని, జకియా ఖానం రాజకీయ నేపథ్యం తెలిసిన కుటుంబానికి చెందని వారని  బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి తెలిపింది. అనంతరం జకియా ఖానం మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ అందరికీ సమాన హక్కులు అమలు చేస్తున్నట్లు వివరించారు.

 

అంతేకాకుండా ముస్లింలకు భరోసా కల్పిస్తున్నారని  జకియా ఖానం వెల్లడించారు. ప్రధానంగా ముస్లింల మహిళలకు ప్రాధాన్యత ఇస్తున్న ఏకైక ప్రధాని నరేంద్ర మోదీ మాత్రమేనని వెల్లడించారు.  ప్రధాని నరేంద్ర మోదీ కీలక పాత్ర పోషిస్తున్నార్నారు. అంతేకాకుండా ముస్లింల మైనార్టీ నుంచి తాను ఒక సందేశం ఇచ్చేందుకు బీజేపీలో చేరుతున్నట్లు చెప్పుకొచ్చారు.