Trains Cancelled : ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ఈ రూట్లలో పలు రైళ్లు రద్దు

Trains Cancelled : నిర్వహణ పనుల వల్ల చర్లపల్లి-తిరుపతి, కాజీపేట-తిరుపతి మధ్య నడిచే రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. చర్లపల్లి-తిరుపతి (రైలు నెం.07257) ఈ నెల 8వ తేదీ నుంచి 29 వరకు, తిరుపతి-చర్లపల్లి (రైలు నెం. 07258) ఈ నెల 9వ తేదీ నుంచి 30 వరకు అందుబాటులో ఉండదని అధికారులు తెలిపారు. కాజీపేట-తిరుపతి (రైలు నెం. 07253) ఈ నెల 6వ తేదీ నుంచి 25 వరకు, తిరుపతి-కాజీపేట (రైలు నెం. 07254) ఈ నెల 7వ తేదీ నుంచి 25 వరకు రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు.
36 ప్రత్యేక రైళ్లు..
శుక్రవారం సాయంత్రం నుంచి చర్లపల్లి నుంచి కాకినాడ, నర్సాపూర్ మధ్య 36 ప్రత్యేక రైలు సర్వీసులను నడుపుతున్నట్లు ఎస్‌సీఆర్ వెల్లడించింది. చర్లపల్లి-కాకికినాడ టౌన్ (07031) ప్రత్యేక రైలు ఈ నెల 2 నుంచి జూన్ 27 వరకు ప్రతి శుక్రవారం రాత్రి 7.20 గంటలకు చర్లపల్లిలో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 4.30 గంటలకు కాకినాడ టౌన్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో రైలు (నెం. 07032) ఈ నెల 4 నుంచి జూన్ 29 వరకు పత్రి ఆదివారం సాయంత్రం 6.55 గంటలకు కాకినాడ టౌన్‌లో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 6.50 గంటలకు చర్లపల్లికి చేరుకుంటుంది. రెండు మార్గాల్లో రైలు నల్లగొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమంత్రి, సామర్లకోట రైల్వే స్టేషన్లలో ఆగుతుందని అధికారులు తెలిపారు.
చర్లపల్లి-నర్సాపూర్ ప్రత్యేక రైలు (నెం. 07233) ఈ నెల 2వ తేదీ నుంచి జూన్ 27 వరకు ప్రతి శుక్రవారం రాత్రి 7.15 గంటలకు చర్లవల్లిలో బయలు దేరుతుంది. మరుసటి రోజు ఉదయం 5.50 గంటలకు నర్సాపూర్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో రైలు (నెం. 07234) ఈ నెల 4 నుంచి జూన్ 29 వరకు ప్రతి ఆదివారం రాత్రి 8 గంటలకు నర్సాపూర్‌లో బయలుదేరుతుంది. మరుసటి రోజు ఉదయం 8 గంటలకు చర్లపల్లి చేరుతుంది. రెండు రూట్లలో రైలు నల్గొండ, మిర్యాలగూడ, నడికుడెం, పిడుగురాళ్ల, సత్తునపల్లి, గుంటూరు, విజయవాడ, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, వీరవాసరం, పాలకొల్లు రైల్వే స్టేషన్లలో ఆగుతుందని చెప్పారు.