Bear Scares Tiger: ఆసక్తికర సంఘటన.. పెద్ద పులినే వణికించిన భల్లూకం

Bear Scares Roaring Tiger in Forest: అడవికి రారాజు సింహాం. ఆ తర్వాత అత్యంత శక్తవంతమైన జంతువు పులి. వీటికి ఎదురెళ్లడానికి ఎలాంటి జంతువు అయిన జంకుతుంది. అడవి రారాజు సింహామైన.. పులులే అత్యంత శక్తవంతమైనవి అంటారు. నిజానికి కొన్నిసార్లు సింహాలు కూడా పులులను చూసి భయంతో వెనక్కి వెళతాయి. పులులు అలా ఎదురైతే చాలు మిగతా జంతువులు వెనకడుకు వేయాల్సిందే. ఏడుగులు వంటి భారీ జీవాలు సైతం పులులను చూసి వెనక్కి తగ్గుతాయి. అయితే ఇక్కడ ఓ భల్లూకం ఏకంగా పులినే వణికించింది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట తెగ ట్రెండ్ అవుతుంది.
ఈ సంఘటన మధ్య ప్రదేశ్‌లోని పంచ్ టైగర్ రిజర్క్‌లో చోటుచేసుకుంది. పంచ్ టైగర్ రిజర్క్‌లో ఓ ఎలుగబట్టి నీళ్లు తాగేందుకు చెరువు దగ్గరికి వచ్చింది. అదే సమయంలో ఓ పెద్ద పులి కూడా అటు వైపు వస్తుంది. అక్కడ భల్లూకాన్ని చూసిన పులి కోపంతో గర్జిస్తూ దానిపై వస్తుంది. దానిని చూసిన ఎలుగుబంటి ఏమాత్రం జంకలేదు. భయంతో పరుగులు తియకుండ తెలివిగా వ్యవహరించింది. ఎక్కడలేని ధైర్యాన్ని కూడగట్టుకుని దూకుడు చూపించింది. ఎలుగుబంటి దూకుడు చూసి పులి మరింత కోపంతో దానిపై గర్జించింది.
ఆ భల్లూకం మీదకు కోపంగా వచ్చే ప్రయత్నం చేసింది. అయినా ఈ ఎలుగు ఏమాత్రం భయపడ లేదు. ధైర్యంగా నిలబడి పులితో యుద్దానికి సై అన్నట్టు బలంగా తన శరీరాన్ని కదిలించింది. ఇక ఈ భల్లూకం తెగింపు చూసి పులే వెనక్కి తగ్గింది. ఎలుగుబంటి తెగువ చూసి పులి భయపడిపోయినట్టు ఈ వీడియో చూస్తే అర్థమైపోతుంది. దాని వల్ల ప్రాణాపాయం ఉందనుకుందో ఏమో పులి భయంతో మెల్లిగా అక్కడి నుంచి జారుకుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. చూడానికి ఫన్నీగా ఉన్న.. ఎలుగుబంటి తెలివి హ్యాట్సాఫ్ అంటున్నారు నెటిజన్స్.
ఈ వీడియో చూసి మనుషులు నేర్చుకోవాలంటున్నారు. మన భయమే మన శత్రువు, భయమే ఒటమికి తొలి మెట్టు అనేది నిజమని, ధైర్యంతో అసాధ్యాన్ని కూడా సాధ్యం చెయొచ్చని ఈ భల్లూకం మరోసారి రుజువు చేసిందంటున్నారు. మన ఆత్మవిశ్వాసమే మనకు గొప్ప ఆయుధం అనేది ఇది ప్రత్యేక్ష ఉదాహరణ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక తెలివిగా వ్యవహరించిన ఈ ఎలుగుపై మరికొందరు ప్రశంసలు కురిపిస్తున్నాయి. దాని ధైర్యాన్ని కొనియాడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
#WATCH | Hilarious! Bear Scares Away Roaring Tiger At Pench Tiger Reserve #MPvideos #MadhyaPradesh #viralvideo pic.twitter.com/FETb4JpEIs
— Free Press Madhya Pradesh (@FreePressMP) April 28, 2025