Last Updated:

Road Accident : చిత్తూరు జిల్లాలో విషాద ఘటన.. వేర్వేరు ప్రమాదాల్లో 9 మంది మృతి, 7 పరిస్థితి విషమం..

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రెండు ఘోర రోడ్డు ప్రమాదాల్లో మొత్తం తొమ్మిది మంది మృతి చెందగా.. మరో ఏడుగురి పరిస్థితి విషయంగా ఉంది. శుక్రవారం తెల్లవారు జామున 3:30 గంటల సమయంలో కేవీ పల్లి మండలం మఠం పల్లి వద్ద తుఫాన్ వెహికల్ లారీని ఢీకొనడంతో 5 మంది మృతి చెందగా మరో 6 మంది తీవ్రంగా గాయపడ్డారు.

Road Accident : చిత్తూరు జిల్లాలో విషాద ఘటన.. వేర్వేరు ప్రమాదాల్లో 9 మంది మృతి, 7 పరిస్థితి విషమం..

Road Accident : ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రెండు ఘోర రోడ్డు ప్రమాదాల్లో మొత్తం తొమ్మిది మంది మృతి చెందగా.. మరో ఏడుగురి పరిస్థితి విషయంగా ఉంది. శుక్రవారం తెల్లవారు జామున 3:30 గంటల సమయంలో కేవీ పల్లి మండలం మఠం పల్లి వద్ద తుఫాన్ వెహికల్ లారీని ఢీకొనడంతో 5 మంది మృతి చెందగా మరో 6 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరంతా కర్ణాటకలోని బెల్గాం జిల్లా అత్తిని తాలూకా బడని గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. 16 మంది తిరుమల శ్రీవారిని దర్శించుకుని తిరుగు ప్రయాణంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది.

ఈ ప్రమాదంలో బెల్గాం జిల్లా అతిని గ్రామానికి హనుమంతు, అంబికా, శోభ, మనందతో పాటు హనుమంతు అనే మరో వ్యక్తి కూడా మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. ప్రమాదం జరిగిన సమయంలో వాహనంలో 16 మంది ఉండగా 11 మందికి తీవ్ర గాయాలు అయ్యాయని పోలీసులు చెప్పారు. గాయపడ్డ వారిలో నలుగురు పరిస్థితి విషమంగా ఉండగా తిరుపతి రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక ఈ ప్రమాదానికి గురైన వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారిన గుర్తించారు పోలీసులు.

accident

అదే విధంగా చిత్తూరు జిల్లాలోనే జరిగిన మరో ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. వీరితో పాటు ప్రయాణించిన మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. తవణంపల్లి మండలం తెల్లగుండ్ల పల్లి వద్ద ఈ ప్రమాదం జరగగా.. ఆగి ఉన్న ట్యాంకర్‌ను అంబులెన్స్ ఢీ కొట్టినట్లు చెబుతున్నారు. భువనేశ్వర్‌కి చెందిన పేషెంట్‌ను బెంగళూరు నుంచి తీసుకెళ్తున్న అంబులెన్స్ రోడ్డు ప్రమాదానికి గురైంది. ప్రమాదంలో మృతి చెందిన వారంతా ఒరిస్సాకు చెందిన వారిగా గుర్తించిన పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఈ సమయంలో అంబులెన్స్‌లో ఉన్న 7 మందిలో నలుగురు మృతి చెందగా మృతుల్లో మహిళతో పాటు ముగ్గురు మగవాళ్లు ఉన్నారు. మరో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకొని ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడ్డ వారిని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.