Road Accident : కర్ణాటకలో రోడ్డు ప్రమాదం.. నలుగురు ఏపీ వాసులు మృతి

Road Accident : కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బొలెరో వాహనం అదుపుతప్పి వంతెనను ఢీ కొట్టింది. దీంతో ఆంధ్రప్రదేశ్‌కి చెందిన నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు.
వివరాల్లోకి వెళ్లే.. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా హిందూపురం గ్రామస్తులు గొర్రెలను కొనుగోలు చేసేందుకు బొలెరో వాహనంలో కర్ణాటకకు వెళ్లగా, యాద్గిర్ జిల్లాలో ప్రమాదం జరిగింది. యాద్గిర్ జిల్లాలోని షాపూర్ వైపు వెళ్తుండగా, మార్గమధ్యలో డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయాడు. దీంతో దేవదుర్గ తాలూకాలోని అమరాపుర క్రాస్ సమీపంలోని వంతెనను ఢీకొట్టాడు. దీంతో నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మృతులను నాగరాజు, సోమ, నాగభూషణ్, మురళిగా గుర్తించారు. డ్రైవర్ ఆనంద్ గాయపడగా, స్థానికులు చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు గబ్బూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.