Published On:

APECET : ఏపీ ఈసెట్ ఫలితాలు విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే

APECET : ఏపీ ఈసెట్ ఫలితాలు విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే

APECET : ఏపీ స్టేట్‌ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (ఏపీఎస్‌సీహెచ్ఈ) ఆధ్వర్యంలో నిర్వహించిన ఏపీ ఈసెట్‌ ఫలితాలు ఇవాళ విడుదలయ్యాయి. ఫలితాల కోసం అభ్యర్థులు https://cets.apsche.ap.gov.in/ECET/ECET/ECET_GetResult.aspx వెబ్‌సైట్‌‌లో తమ రిజిస్ట్రేషన్ నంబర్, హాల్‌టికెట్ నంబర్, పుట్టిన తేదీని నమోదు చేసి ఫలితాలు పొందవచ్చు.

 

పరీక్ష ద్వారా పాలిటెక్నిక్‌ డిప్లొమా, బీఎస్సీ గణిత శాస్త్రం విద్యార్థులకు 2025–26 విద్యా సంవత్సరానికి BE/BTech/B.Pharmacy కోర్సుల్లో లేటరల్ ఎంట్రీ ద్వారా రెండో ఏడాదిలో ప్రవేశాలు లభిస్తాయి. పరీక్షను విజయవంతంగా పూర్తి చేసిన అభ్యర్థులు త్వరలో ప్రారంభమయ్యే AP ECET 2025 కౌన్సెలింగ్ ప్రక్రియ ద్వారా తగిన సీట్లను పొందవచ్చు.

 

సత్తాచాటిన సిద్దిపేట జిల్లాకు చెందిన రేవతి..
35,187 మంది విద్యార్థులు పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం 31,922 మంది పరీక్ష రాశారు. తెలంగాణలోని సిద్దిపేట జిల్లాకు చెందిన రేవతి 169 మార్కులతో ప్రథమ ర్యాంకు సాధించింది. రెండు, మూడు, నాలుగో స్థానాలను తెలంగాణ విద్యార్థులు దక్కించుకున్నారు.

ఇవి కూడా చదవండి: