Published On:

Nara Lokesh : 27 నుంచి 29 వరకు మహానాడు.. ఏర్పాట్లపై మంత్రి నారా లోకేశ్ సమీక్ష

Nara Lokesh : 27 నుంచి 29 వరకు మహానాడు.. ఏర్పాట్లపై మంత్రి నారా లోకేశ్ సమీక్ష

Minister Nara Lokesh : మహానాడుకు ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయని, ఈ నెల 27వ తేదీ నుంచి 29వ తేదీ వరకు కడపలో నిర్వహించనున్నట్లు మంత్రి నారా లోకేశ్ తెలిపారు. బుధవారం మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో మహానాడు కమిటీల కన్వీనర్లు, కో-కన్వీనర్లతో భేటీ అయ్యారు. మహానాడు ఏర్పాట్లపై నేతలతో చర్చించారు. ఈ సందర్భంగా పలువురు మంత్రులు, సీనియర్ నేతలకు బాధ్యతలు అప్పగించారు. పొలిట్ బ్యూరో సమావేశంలో మహానాడు ఏర్పాట్లపై మంత్రి ఆధ్వర్యంలోని మంత్రుల కమిటీ నివేదిక ఇవ్వనుంది.

 

ఏటా పండుగ వాతావరణంలో మహానాడు..
ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ మాట్లాడుతూ.. ఏటా మహానాడును పండుగ వాతావరణంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పార్టీ కష్టకాలంలో ఉన్నా అధికారంలో ఉన్నా మహానాడును నిర్వహించామన్నారు. గత ప్రభుత్వంలో మహానాడుకు అడుగడుగునా ఇబ్బందులు పెట్టారని గుర్తుచేశారు. ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి విజయవంతం చేశారని కొనియాడారు. పార్టీ ఆవిర్భావం తర్వాత చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా తిరుగులేని మెజార్టీ సాధించామని తెలిపారు. కార్యకర్తలకు వసతి, రవాణాకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని నేతలకు ఈ సందర్భంగా దిశానిర్దేశం చేశారు.

 

ఈ నెల 29న బహిరంగ సభ..
మూడురోజుల పాటు జరిగే మహానాడులో మొదటి రోజు టీడీపీ విధి విధానాలు, సిద్ధాంతాలు, కార్యాచరణపై చర్చించనున్నారు. రెండోరోజూ రాష్ట్రం కోసం కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై రూపొందించిన తీర్మానాలు చేయనున్నారు. మూడో రోజు బహిరంగ సభ నిర్వహించనున్నారు. పార్లమెంట్ మహానాడు, నియోజకవర్గ మహానాడు నిర్వహణపై ఈ భేటీలో చర్చించారు.

ఇవి కూడా చదవండి: