YSRCP : జగన్ సొంత జిల్లాలో వైసీపీకి షాక్.. మైదుకూరు మున్సిపల్ చైర్మన్ రాజీనామా

Shock for YCP in Kadapa : మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సొంత జిల్లా కడపలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. మైదుకూరు మున్సిపల్ చైర్మన్ చంద్ర వైసీపీకి రాజీనామా చేశారు. కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఇవాళ ఆయన పార్టీకి గుడ్‌బై చెప్పారు. వైఎస్ జగన్‌తో మాట్లాడించాలని మూడునెలలుగా మాజీ ఎమ్మెల్యేను కోరుతున్నా పట్టించుకోవడం లేదని చంద్ర తెలిపారు. అనుచరుల అభిప్రాయం మేరకు భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకంటున్నట్లు చెప్పారు. ఆయన టీడీపీ లేదా జనసేన పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
శ్రీసత్యసాయి జిల్లాలో కూడా..
శ్రీసత్యసాయి జిల్లా మడకశిరలోను వైసీపీకి గట్టి షాక్ తగిలింది. మున్సిపాలిటీ చైర్‌పర్సన్, వైస్ చైర్మన్లపై పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. దీంతో మున్సిపాలిటీ పీఠాన్ని వైసీపీ కోల్పోయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి పనులకు చైర్‌పర్సన్ లక్ష్మీనర్సమ్మ, వైస్ చైర్మన్ రామచంద్రారెడ్డి ఆటంకం కలిస్తుండటంతో విసిగిపోయిన కౌన్సిలర్లు కొన్నిరోజుల క్రితం టీడీపీలో చేరారు. మున్సిపాలిటీని ప్రగతిపథంలో నడిపేందుకు సరైన నాయకత్వం అవసరమని భావించి చైర్‌పర్సన్, వైస్ చైర్మన్లపై కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. అధికారులు ఇవాళ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యేతోపాటు 15 మంది కౌన్సిలర్లు మద్దతు తెలపడంతో అవిశ్వాస తీర్మానం నెగ్గినట్లు అధికారులు ప్రకటించారు.