Sajjala Ramakrishna Reddy: రాష్ట్రంలో పోలీసులు పరిధి దాటి వ్యవహరిస్తున్నారు: సజ్జల రామకృష్ణారెడ్డి!

Sajjala Ramakrishna Reddy Comments: ఏపీలో పోలీస్ వ్యవస్థను నీరు గారుస్తూ రాజకీయ కక్ష సాధింపులకు వినియోగిస్తున్న కూటమి ప్రభుత్వపై వైసీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో సోమవారం నాయకులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
ఏపీలో పోలీసులు పరిధి దాటుతున్నారని మండిపడ్డారు. చట్టాన్ని చేతిలోకి తీసుకుంటూ పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. తాజాగా మాజీ మంత్రి విడదల రజిని పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై మండిపడ్డారు. ఏపీలో పోలీసుల ద్వారా కూటమి ప్రభుత్వం చేయిస్తున్న దౌర్జన్యకాండకు నిదర్శనమన్నారు. కూటమి ఏపీలో ప్రశ్నించే గొంతులను నొక్కేస్తోందని మండిపడ్డారు. ఎవరైనా ప్రభుత్వ వైఫ్యలాలను నిలదీస్తే కేసులు బనాయిస్తున్నారని ఫైర్ అయ్యారు.
పోలీసులు చట్టపరమైన నిబంధనలను పాటించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించడం దారుణమన్నారు. డీజీపీకి ఫిర్యాదు చేసే అవకాశం ఇవ్వకపోవడం దారుణమన్నారు. పలుమార్లు డీజీపీ అపాయింట్‌మెంట్ కోరినా స్పందించకపోవడం సిగ్గు చేటన్నారు. వ్యవహారాన్ని పార్టీ సీరియస్‌గా తీసుకుంటోందన్నారు. వ్యవస్థను కాపాడేందుకు బాధ్యత గల ప్రతిపక్షంగా స్పందిస్తుందన్నారు.