Home / CM Chandrababu
Chandrababu : పోలవరం ప్రాజెక్టు ఎప్పుడో పూర్తి కావాల్సిందని, కావాలనే దానిని వైఎస్ జగన్ పక్కన పెట్టారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. జగన్ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో పోలవరం నిర్వాసితులకు రూ.10లక్షలు ఇస్తానని చెప్పి, అధికారంలోకి వచ్చిన తర్వాత పైసా కూడా వివ్వలేదని సీఎం విమర్శించారు. ఇవాళ పోలవరం ప్రాజెక్టును సీఎం సందర్శించి, నిర్వాసితులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం నిర్వాసితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడారు. అంతకుముందు ఏరియల్ వ్యూ […]
Cabinet Meeting : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రేపు (సోమవారం) కేబినెట్ సమావేశం జరగనుంది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో కేబినెట్ భేటీ ప్రారంభం కానుంది. ఈ భేటీలో అసెంబ్లీలో ప్రవేశపెట్టే పలు బిల్లులుకు మంత్రివర్గం ఆమోదం పలకనున్నట్లు తెలుస్తోంది. రాజధాని అమరావతిలో చేపట్టనున్న 22 పనులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందని సమాచారం. ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చిన 10 సంస్థలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఎస్ఐపీబీ […]
CM Chandrababu : పొట్టి శ్రీరాములు స్వగ్రామాన్ని అభివృద్ధి చేస్తామని, ఆయన నివాసం ఉన్న ఇంటిని ప్రభుత్వమే కొని మ్యూజియంగా అభివృద్ధి చేస్తుందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఇవాళ ఉండవల్లిలో పొట్టి శ్రీరాములు జయంతి కార్యక్రమంలో పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి చంద్రబాబు, మంత్రి నారాయణ నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడారు. త్యాగాలు తెలిసేలా.. మొన్న ఆత్మార్పణ దినోత్సవాన్ని పెద్దఎత్తున జరుపుకున్నామని సీఎం గుర్తుచేశారు. కర్నూలుతో ప్రారంభమైన తెలుగు […]
CM Chandrababu : కూటమి ప్రభుత్వంలో ఏ కార్యక్రమం మొదలు పెట్టినా మహిళలకే ప్రాధాన్యత ఇస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఇవాళ శాసనసభలో ఆయన మాట్లాడారు. మహిళా సాధికారతను మాటల్లో చెప్పడం కాదని, చేతల్లో చేసి చూపించాలన్నారు. టీడీపీతోనే మహిళా సాధికారత ప్రారంభమైందని చెప్పారు. మహిళలకు ఆస్తిలో హక్కును తొలిసారి ఎన్టీఆర్ కల్పించారని గుర్తుచేశారు. తల్లి, చెల్లికి ఆస్తిలో వాటా ఇవ్వని వ్యక్తి గతంలో సీఎంగా ఉన్నారని, ఇచ్చిన ఆస్తిని కూడా వెనక్కి తీసుకునేందుకు కోర్టుకు […]
MLC Candidates : ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కసరత్తు ఇంకా పూర్తి కాలేదు. నామిషన్లకు రేపే చివరి రోజు కావడంతో ఆశావహులు ఆశగా ఎదురుచూస్తున్నారు. సాయంత్రంలోగా ఏ క్షణమైనా అభ్యర్థుల జాబితా ప్రకటించే అవకాశం ఉందని టీడీపీ కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు ఖాళీ ఏర్పడింది. సభలో ఉన్న సభ్యుల ఆధారంగా పోటీ చేసిన అభ్యర్థులకు విజయం దక్కుతుంది. అసెంబ్లీలో దాదాపు […]
CM Chandrababu : రాష్ట్రాన్ని మహిళా పారిశ్రామికవేత్తల హబ్గా తీర్చిదిద్దుతామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. మహిళల భాగస్వామ్యం లేకుండా ప్రగతి అసాధ్యమన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఇంట్లో పురుషులతో సమానంగా మహిళలను అన్నిరంగాల్లో అభివృద్ధి చేయాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేస్తామన్నారు. మహిళా దినోత్సవ సందర్భంగా ప్రకాశం జిల్లా మార్కాపురంలో జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముందుగా స్వయం సహాయక బృందాలు ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. […]
AP CM Chandrababu : వైఎస్ వివేకానందారెడ్డి హత్య కేసులో ప్రత్యేక్ష సాక్షి వాచ్మెన్ రంగన్న మృతి అనుమానాస్పదంగా ఉందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. కేబినెట్ భేటీ అనంతరం మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో ప్రత్యక్ష సాక్షి వాచ్మెన్ మృతిపై చర్చించారు. వివేకానందారెడ్డి హత్యకేసు సాక్షులు ఒక్కొక్కరుగా మృతి చెందుతున్న అంశంపై గంటపాటు చర్చ జరిగింది. రంగన్నను పోలీసులు చంపారని ముందు వార్తలు రావడంపై మంత్రివర్గంలో అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఎలాంటి దురుద్దేశం లేకపోతే […]
AP Cabinet Decisions: సీఎం చంద్రబాబు అధ్యక్షతన అమరావతిలోని సచివాలయంలో జరిగిన ఏపీ కేబినెట్ ముగిసింది. ఈ మేరకు 14 అంశాలకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో డీపీవోలకు నేరుగా రిపోర్టు చేసేలా కేడర్లో మార్పు చేర్పుల నిర్ణయానికి ఆమోదం తెలిపింది. కేడర్ రేషనలైజేషన్పై పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించింది. పౌరసేవలు ప్రజలకు అందేలా కేడర్లో మార్పు చేర్పులకు నిర్ణయం తీసుకుంది. ఏపీ ప్రైవేట్ యూనివర్సిటీల చట్ట సవరణ బిల్లు […]
CM Chandrababu Naidu interesting Comments: కలిసికట్టుగా పనిచేస్తే వికసిత్ భారత్- స్వర్ణాంధ్రప్రదేశ్ సాధ్యమని చంద్రబాబు అన్నారు. మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు రచించిన ‘ప్రపంచ చరిత్ర’ పుస్తకావిష్కరణను విశాఖపట్నంలోని గీతం యూనివర్సిటీలో నిర్వహించారు. ఈ పుస్తకావిష్కరణకు సీఎం చంద్రబాబు, వెంకయ్యనాయుడు, నిర్మలా సీతారామన్, పురంధేశ్వరి హాజరయ్యారు. ఈ మేరకు తెలుగు పుస్తకాన్ని వెంకయ్యనాయుడు ఆవిష్కరించగా.. ఇంగ్లిష్ అనువాదక పుస్తకాన్ని నిర్మలా సీతారామన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. ఏపీకి ఆర్థిక కష్టాలు ఉన్నా ధైర్యంగా […]
AP Budget 2025 Allocates funds for Super Six Schemes and Development: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్.. రూ.3.24 లక్షల కోట్లతో 2025-26 బడ్జెట్ను సభలో ప్రవేశపెట్టారు. అంతకు ముందు.. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన ఏపీ కేబినెట్ ఈ పద్దును ఏకగ్రీవంగా ఆమోదించింది. రాష్ట్ర చరిత్రలో తొలి సారిగా 3 లక్షల కోట్లు దాటిన ఈ పద్దులో.. సంక్షేమానికి పెద్ద పీట వేశారు. కాగా, ఏపీ […]