WWE రెజ్లింగ్‌లో రానా దగ్గుబాటి రికార్డు : Rana Daggubati In WWE WrestleMania41

- WWE రెసిల్ మేనియాకు అహ్వానించబడ్డ మొట్టమొదటి నటుడుగా రాణా నిలిచాడు
- WWE వేదికపై ‘రాణా నాయుడు’ ప్రమోషన్స్
Rana Daggubati In WWE WrestleMania41 : WWE రెసిల్ మేనియా41కు భారత్ తరపున నటుడు రాణా దగ్గుబాటి హాజరయ్యాడు. భారత్ తరపున మొట్టమొదటగా WWEకు ఆహ్వానించబడ్డ నటుడిగా రికార్డులకెక్కాడు. లాస్ వెగాస్ లో WWE రెజిల్ మేనియా 41 ఈ నెల 19-20 తేదీల్లో జరిగింది. రెజిల్ మానియాకు భారత్ లో అభిమానులకు కొదువలేదు. ఇది సాంప్రదాయ కుస్తీ పోటీలకు కాస్త విరుద్దమైనది. అయితే ఇది అంతర్జీతీయ స్థాయిలో నెంబర్ వన్ రెజ్లింగ్ ఆటగా పేరుతెచ్చుకుంది. భారత్ కు చెందిన ‘ది గ్రేట్ ఖలీ’ అనే పంజాబీ వ్యక్తి గతంలో WWEలో తన సత్తా చాటాడు.
అభినందనలలో మునిగితేలిన రాణా దగ్గుబాటి
లాస్ వెగాస్‌లోని అల్లెజియంట్ స్టేడియంలో జరిగిన ఈ పోటీని రాణా దగ్గుబాటి దగ్గరుండి వీక్షించాడు. మ్యాచ్ జరుగుతున్నప్పుడు ప్రపంచవ్యాప్త రెజ్లింగ్ ప్రముఖులతో అభినందనలు అందుకున్నాడు. రెజ్లింగ్ మానియా భారత్ లోని ప్రతీ టీనేజర్ జీవితంలో భాగం అనడంలో సందేహం లేదని రాణా అభిప్రాయపడ్డాడు. ఈ పోటీలో పాల్గొనే వాళ్లు వివిధ దేశాలనుంచి ప్రాతినిధ్యం వహిస్తారు. తమ భారీ శరీరాలతో విచక్షణ రహితంగా కుస్తీలో పాల్గొంటారు. ఈ ఆటకు ప్రపంచ నలుమూలల్లో ఊహకు అందని క్రేజ్ ఉందంటే అతిశయోక్తి కాదేమో.
రెజ్లింగ్ మ్యాచ్ అనుభవాన్ని పంచుకున్న రాణా
రెజ్లింగ్ మ్యాచ్ ను చూసిన అనుభవాన్ని రాణా తన సోషల్ మీడియాలో పంచుకున్నాడు. “రెజిల్ మేనియా 41 లో భాగం కావడం నమ్మలేకపోతున్నాను. WWEమనందరి బాల్యంలో ఒక భాగం. ఇప్పుడు నేను దానిని ప్రత్యక్షంగా చూడటంతో పాటు భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడం గర్వంగా ఉంది. ” అని రాణా ఎక్స్ లో పోస్ట్ చేశారు.
రాణా WWEలో పాల్గొన్న ఫొటోలను, వీడియోలను నెట్‌ఫ్లిక్స్ విడుదల చేసింది. హీల్ ఫేసెస్, రాణా దగ్గుబాటి ఎట్ రెజిల్ మానియా, జో లైన్ క్రాస్ కియా వో గయా ( ఎవరైతే లైన్ క్రాస్ చేస్తారో వారు పోయినట్లే ) అంటూ ఎక్స్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఇంటర్ నెట్ లో ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
ఆకట్టుకున్న జాన్ సిన
రెజిల్ మానియా ఈ నెల 19-20 తేదీల్లో లాస్ వెగాస్ లో జరిగింది. ప్రపంచం నలుమూలల్లోంచి రెజ్లర్లు ఇక్కడికి వస్తారు. ప్రపంచంలోనే అతి పెద్ద రెజ్లింగ్ ఈవింట్ ఇది. ఇందులో ప్రముఖ రెజ్లర్ జాన్ సిన సందడి చేయండంతో పాటు విజేతగా నిలిచారు. దీంతో 17 టైటిల్లను కొళ్లగొట్టిన రెజ్లర్ గా జాన్ సిన రికార్డులకెక్కారు.
మ్యాచ్ మద్య ‘రాణా నాయుడు’ ప్రమోషన్
ఇదిలా ఉండగా రానా దగ్గుబాటి ‘రాణా నాయుడు’ రెండవ సీజన్ విడుదలకు రెఢీ అవుతోంది. ఇందులో విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. మొదటి సీజన్ ఊహించని బోల్డ్ క్యారెక్టర్ ను పోషించిన వెంకీ ఈసారి డోసుకాస్త తగ్గించినట్లు తెలుస్తోంది. ఈ సీజన్ లో రాణాతో అర్జున్ రాంపాల్ స్ర్కీన్ ను షేర్ చేసుకున్నారు.
ఇవి కూడా చదవండి:
- BCCI Central Contract 2024-25 : BCCI సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్ట్ రిలీజ్! శ్రేయాస్ ఇన్, పంత్ కు బంపర్ ఆఫర్