Last Updated:

Health Benefits of Lemon Juice: ఖాళీకడుపుతో నిమ్మరసం తీసుకుంటే ఆరోగ్యం మీ సొంతం..!

నిమ్మకాయ.. దీని పేరు వినిపించగానే మన నోట్లో లాలాజలం ఊరిపోవడం సహజం. నిమ్మలో విటమిన్ సీ, ఈ, బీ6 తోపాటు థయామిన్, నియాసిన్, రైబోప్లేవిన్, ఫోలేట్ వంటి పోషకాలు మెండుగా ఉంటాయి. ఉదయాన్నే నిమ్మరసం తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు పోషకాహార నిపుణులు. మరి అవేంటో చూద్దామా..

Health Benefits of Lemon Juice: ఖాళీకడుపుతో నిమ్మరసం తీసుకుంటే ఆరోగ్యం మీ సొంతం..!

Health Benefits of Lemon Juice: నిమ్మకాయ.. దీని పేరు వినిపించగానే మన నోట్లో లాలాజలం ఊరిపోవడం సహజం. నిమ్మలో విటమిన్ సీ, ఈ, బీ6 తోపాటు థయామిన్, నియాసిన్, రైబోప్లేవిన్, ఫోలేట్ వంటి పోషకాలు మెండుగా ఉంటాయి. ఉదయాన్నే నిమ్మరసం తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు పోషకాహార నిపుణులు. మరి ఈ నిమ్మకాయలో 22 క్యాన్సర్ వ్యతిరేక సమ్మేళనాలు ఉన్నాయట.. ఇవి క్యాన్సర్ కణితుల పెరుగుదలను నిలిపివేస్తుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. నిమ్మకాయను అన్ని కాలాల్లో వినియోగించుకోవచ్చు అంట మరి ఎలా ఉపయోగంచడం వల్ల ఏఏ వ్యాధులను దూరం చేసుకోవచ్చో ఓ సారి చూసేద్దాం..

  1. ఖాళీ కడుపుతో గోరువెచ్చని నిమ్మకాయ రసం ఏ కాలంలో అయినా తాగవచ్చు. ఇది యాసిడ్ రిఫ్లక్స్‌ను నివారించడంలో సహాయపడుతుంది.ఇలా తాగడం వల్ల శరీరంలోని జీవక్రియను పెంచి అదనపు కొవ్వును కరిగించవచ్చు. ఫలితంగా శరీరం బరువును తగ్గించుకోవచ్చు. ఈ రసం జీర్ణక్రియను ఉత్తేజపరుస్తుంది. మలబద్ధకం, అజీర్థి సమస్యలను దూరం చేసుకోవచ్చు.
  2. ఉదయాన్నే ఖాళీ కడుపుతో నిమ్మకాయ నీరు శరీరం నుంచి విషపదార్థాలను బయటకు పంపడంలో సహాయపడుతుంది.
    లెమన్ వాటర్ ఒక గొప్ప డిటాక్స్ డ్రింక్‌గా చెప్పుకవచ్చు. నిత్యం నిమ్మరసం తీసుకోవడం వల్ల చర్మం ప్రకాశవంతమైన మెరుపుతో ఉంటుంది.
  3. నిమ్మకాయ నీటిలో యాంటీఆక్సిడెంట్లు, పొటాషియం, ఫోలేట్, ఫ్లేవనాయిడ్లు, కొంత మొత్తంలో విటమిన్ బీ ఉండి కడుపులో మంటను
    నివారించడంలో సహాయపడతాయి. దీనిలోని సీ విటమిన్ ఫుడ్ లోని ఐరన్‌ను గ్రహించడంలో తోడ్పడుతుంది. శరీరంలో హిమోగ్లోబిన్ సరిగా ఉండేలా కాపాడుతుంది.
  4. నిమ్మ నీరు శరీరంలోని సహజ రోగనిరోధక వ్యవస్థను పెంచడంలో సహాయపడుతుంది. దీనిలోని సీ విటమిన్.. ఫ్లూ, జలుబు నుంచి రక్షిస్తుంది. వ్యాధికారకాలు, వివిధ వైరస్‌ల నుంచి శరీరాన్ని రక్షించడంలో తోడ్పడుతుంది.
  5. నిమ్మకాయ నీరు చక్కెరలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఖాళీ కడుపుతో నిమ్మరసం తీసుకోవడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది.
  6. ఉదయాన్నే నిమ్మరసం తీసుకోవడం వల్ల శరీరం హైడ్రేటెడ్‌గా ఉండి శరీరంలో వేడిని తగ్గిస్తుంది. నిమ్మ నీరు కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.

ఈ నిమ్మరసాన్ని కూడా రోజు తీసుకోవడం మంచిది కాదని ఆహార నిపుణులు వెల్లడిస్తున్నారు. నిత్యం ఎక్కువ మొత్తంలో నిమ్మరసం తీసుకునేవారిలో ఒకేసారి శరీరం బరువు పెరగడం, ఊబకాయం, టైప్‌ 2 డయాబెటీస్‌, గుండె సంబంధ వ్యాధులు కనిపించే అవకాశాలు ఉన్నాయని హెచ్చరిస్తుననారు. మరియు దంతాల ఎనామిల్‌ సమస్యలు వస్తుంటాయి. కడుపు నొప్పితోపాటు గ్యాస్ట్రిక్‌ సమస్యలను తీవ్రతరం చేస్తుందని.. నిమ్మలోని సిట్రిక్‌ యాసిడ్‌ నోటిపూతలను ప్రేరేపిస్తుందని చెప్తున్నారు. అందుకని వారానికి ఒకటి రెండు సార్లు తీసుకుని నిమ్మతో నిమ్మలంగా జీవిద్దాం.

ఇది చదవండి: Health Benefits Of Garlic: వెల్లుల్లి వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే..

ఇవి కూడా చదవండి: