Tips For Belly Fat: వావ్.. 7 రోజుల్లోనే వెయిట్ లాస్, ఎలాగంటే ?

Tips For Belly Fat: పెరుగుతున్న బరువును తగ్గించుకోవడానికి చాలా మంది రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ముఖ్యంగా సమ్మర్‌లో బరువు ఎక్కువగా ఉన్నవారికి వేడిగా అనిపించడం వల్ల బరువు తగ్గాలని , ఫిట్‌గా ఉండాలని అనిపిస్తుంది. వేసవిలో, బరువు తగ్గడం సవాల్ అనే చెప్పాలి. ఈ సమయంలో కొన్ని రకాల టిప్స్ పాటించడం వల్ల మీరు ఈజీగా బరువు తగ్గొచ్చు. మరి అదెలాగో తెలుసుకుందామా..
రంగురంగుల కూరగాయలు, పండ్లు: బరువు తగ్గడానికి మొదటగా చేయాల్సింది మీ జీవక్రియను పెంచుకోవడం. అంటే పోషకాలు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం. రంగురంగుల కూరగాయలు, లీన్ ప్రోటీన్లు, పండ్లు , ఆరోగ్యకరమైన కొవ్వులు తినడం వల్ల బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది. ఇవి శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తాయి. అంతే కాకుండా మీ శరీరంలో ఈజీగా బెల్లీ ఫ్యాట్ తగ్గించడానికి ఉపయోగపడతాయి.
చియా సీడ్స్ వాటర్: సమ్మర్‌లో చెమట పట్టడం వల్ల ఎక్కువగా నీరు కోల్పోతారు. జీవక్రియను నెమ్మదింపజేయడం ద్వారా నిర్జలీకరణ శక్తి తగ్గుతుంది. జీర్ణక్రియ సక్రమంగా జరగాలన్నా లేదా బెల్లీ ఫ్యాట్ తగ్గాలన్నా.. తరచుగా నీరు తాగాలి. కొవ్వును వేగంగా కరిగించడానికి, తులసి గింజలు లేదా చియా గింజలు కలిపిన నీరు తాగడం మంచిది.
గ్రీన్ టీ: కెఫిన్ కొవ్వు ఆక్సీకరణకు సహాయపడుతుంది. అంతే కాకుండా మీ దృష్టిని మెరుగుపరుస్తుంది. గ్రీన్ టీ లేదా కాఫీ వంటి సహజ డ్రింక్స్ మీకు చాలా బాగా ఉపయోగపడతాయి. కానీ వీటిని ఎక్కువగా తీసుకోవడం కూడా అంత మంచిది కాదు ఎందుకంటే ఇది ఆందోళన, నిద్రలేమికి దారితీస్తుంది.
ప్రశాంతమైన నిద్ర: నిద్ర లేమి హార్మోన్లకు అంతరాయం కలిగిస్తుంది. అంతే కాకుండా ఇది తినాలన్ని కోరికలను పెంచుతుంది. అంతే కాకుండా కొవ్వు తగ్గడాన్ని నిరోధిస్తుంది. అందుకే రోజుకు 7 నుండి 9 గంటలు నిద్రపోవడం చాలా అవసరం.
యోగా, ధ్యానం: ఒత్తిడికి దూరంగా ఉండటం , ప్రశాంతంగా ఉండటం చాలా ముఖ్యం. ఇందుకోసం మీరు ధ్యానం కూడా చేయవచ్చు. యోగా వల్ల కూడా అనేక ప్రయోజనాలు ఉంటాయి. ఇది ఎండార్ఫిన్‌లను పెంచడానికి , కార్టిసాల్ స్థాయిలను తగ్గించడానికి సహాయపడుతుంది.
ఎల్ కార్నిటైన్ సప్లిమెంట్ : L-కార్నిటైన్ మీ కణాలలోకి కొవ్వు ఆమ్లాలను రవాణా చేయడంలో సహాయపడుతుంది. అందుకే బెల్లీ ఫ్యాట్ తగ్గడానికి ఎఫెర్వెసెంట్ ఎల్-కార్నిటైన్‌ను ఎంచుకోండి.