Published On:

Tips for sugar control: ఈ సింపుల్ టిప్స్ ఫాలో అయితే చాలు.. షుగర్ లెవెల్స్ కంట్రోల్ !

Tips for sugar control: ఈ సింపుల్ టిప్స్ ఫాలో అయితే చాలు.. షుగర్ లెవెల్స్ కంట్రోల్ !

Tips for sugar control: ప్రస్తుతం చాలా మంది డయాబెటిస్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తినే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఎందుకంటే వీరు షుగర్ లెవల్స్ కంట్రోల్ లో ఉంచుకోవడం చాలా అవసరం. కానీ రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడం అంత తేలికైన పని కాదు. చాలా సార్లు, చక్కెర , స్వీట్లు మానేసినప్పటికీ షుగర్ లెవల్స్ నియంత్రణ ఉండవు. మరి ఇందుకు గల కారణాలు బయటపడే మార్గాలను గురించి తెలుసుకుందామా..

డయాబెటిస్ ఒక ప్రపంచ సమస్య:
రక్తంలో చక్కెర స్థాయి ఎక్కువగా ఉంటే.. మీరు ప్రీ-డయాబెటిస్ , డయాబెటిస్ బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. 2022 లో ప్రపంచవ్యాప్తంగా 830 మిలియన్ల మంది మధుమేహం బాధితులుగా మారారు. 1990 లో.. ఈ సంఖ్య 200 మిలియన్లు. అంటే.. 32 సంవత్సరాల్లోనే మధుమేహంతో బాధపడే వారి సంఖ్య 630 మిలియన్లు పెరిగింది. వీరిలో 90% మంది టైప్ 2 డయాబెటిస్‌తో బాధపడుతున్నారు. దీనికి ప్రధాన కారణం జీవనశైలిలో మార్పు, ఆహారపు అలవాట్లు అని చెప్పవచ్చు. ఆందోళనకరమైన విషయం ఏంటంటే.. ప్రతి 10 మంది రోగులలో నలుగురికి తాము డయాబెటిస్‌ బాధితులమని తెలియదు.

షుగర్ కంట్రోల్ లో ఉండాలంటే ?

చక్కెర స్థాయి: ఒక రోజు రాత్రి సరిగ్గా నిద్రపోకపోతే మరుసటి రోజు మీ ఇన్సులిన్ నిరోధకత పెరుగుతుంది. ఇది చాలా మందికి తెలియని విషయం. ఎక్కువ ఒత్తిడి కారణంగా.. మీ శరీరంలో కార్టిసాల్ హార్మోన్ స్థాయి పెరగుతుంది. ఈ ఒత్తిడి హార్మోన్ మీ రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతుంది.

దీనితో పాటు.. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో గట్ మైక్రోబయోమ్ కూడా చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని నేరుగా ప్రభావితం చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మీరు పోషకాలు ఉన్న, ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తిన్నప్పుడు, గట్ బాక్టీరియా వాటిని కొవ్వు ఆమ్లాలుగా విచ్ఛిన్నం చేస్తుంది. పోషకాహారం తిననప్పుడు, గట్ మైక్రోబయోమ్ సరిగా పనిచేయదు. ఫలితంగా ఇన్సులిన్ స్థాయిలు హెచ్చుతగ్గులకు గురవుతాయి. ఇలాంటి పరిస్థితిలో.. మీ రక్తంలో చక్కెర స్థాయి పెరగడం ప్రారంభమవుతుంది.

సింపుల్ చిట్కాలు:

1. ఒత్తిడి: ఒత్తిడి నియంత్రణలో ఉన్నపప్పుడు మాత్రమే మీరు మీ రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుకోవచ్చు. ఇందుకోసం శ్వాస సంబంధిత వ్యాయామాలు చేయండి. ధ్యానం, వాకింగ వంటివి చేయడం వల్ల కూడా మంచి ప్రయోజనం పొందుతారు.

2. తగినంత నిద్ర: తగినంత నిద్రపోవడం ద్వారా మీ రక్తంలో చక్కెర స్థాయిని కూడా తగ్గించుకోవచ్చు. రాత్రి 7 నుండి 9 గంటల పాటు గాఢమైన నిద్ర ఉండేలా చూసుకోండి. ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని సరిగ్గా ఉంచుతుంది.

3. కండరాల నిర్మాణం: మీ బలాన్ని, కండరాల నిర్మాణాన్ని పెంచుకోవడంపై పూర్తిగా దృష్టి పెట్టండి. దీంతో శరీరం గ్లూకోజ్‌ను సరిగ్గా ఉపయోగించుకుంటుంది.

4. సమతుల్య ఆహారం: పోషకాహారం తినండి. ఆహారంలో ప్రోటీన్, ఫైబర్ , ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండేలా చూసుకోండి. దీని వల్ల రక్తంలో చక్కెర స్థాయి అకస్మాత్తుగా పెరగకుండా ఉంటుంది.

5. వాకింగ్ : భోజన తర్వాత.. కనీసం 10 నిమిషాలు నడవండి. ఇది మీ రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది.