Published On:

Heart Attack Symptoms: ఈ లక్షణాలు మీలో ఉంటే అస్సలు లైట్ తీసుకోవద్దు.. హార్ట్ ఎటాక్ కావొచ్చు !

Heart Attack Symptoms: ఈ లక్షణాలు మీలో ఉంటే అస్సలు లైట్ తీసుకోవద్దు.. హార్ట్ ఎటాక్ కావొచ్చు !

Symptoms Of Heart Attack In Men: ప్రతి ఏడాది లక్షలాది మంది గుండె సంబంధిత సమస్యలు, ముఖ్యంగా గుండెపోటు వల్ల మరణిస్తున్నారు. గతంలో వయస్సు పైబడే వారికి గుండె జబ్బులు ఎక్కువగా వస్తాయిని అనుకునే వారు. కానీ ప్రస్తుతం యుక్త వయస్సు వారు కూడా హార్ట్ ఎటాక్ తో మరణిస్తున్నారు. మన లైఫ్ స్టైల్ మారుతున్నా కొద్దీ.. తీవ్రమైన వ్యాధుల బారిన పడే ప్రమాదం యువతలో పెరుగుతోందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందుకే ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. ముఖ్యంగా గుండెపోటు లక్షణాల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవడం తప్పనిసరి.

హార్ట్ ఎటాక్ లక్షణాలు:

గుండె యొక్క కండరాలకు రక్త ప్రసరణ సరిగ్గా జరగనప్పుడు గుండెపోటు వస్తుంది. ఛాతీ నొప్పి వంటి సాధారణ లక్షణాలతో లేదా ఎలాంటి లక్షణాలు ముందుగా లేకుండా కూడా హార్ట్ ఎటాక్ రావొచ్చు. ఇదే కాకుండా.. హార్ట్ ఎటాక్‌కి ముందు కొంతమందికి ఛాతీ బిగుతుగా అనిపించడం, భుజం-దవడ నొప్పితో పాటు చెమట , అలసట వంటి ఇతర లక్షణాలు కూడా కనిపిస్తాయి.

శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది: గుండె పోటుకు అనేక కారణాలు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కూడా గుండెపోటుకు సంకేతం కూడా కావచ్చు. శ్వాస తీసుకోవడానికి, మీ గుండె ద్వారా రక్తాన్ని వివిధ భాగాలకు సరఫరా చేయడానికి మధ్య దగ్గరి సంబంధం ఉంటుంది. మీ గుండె రక్తాన్ని బాగా పంప్ చేయలేకపోతే.. మీకు ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందిగా అనిపిస్తుంది. దీనిని గుండెపోటుకు సంకేతంగా కూడా భావిస్తారు.

అలసట సమస్య: ఎక్కువగా పని చేయడం లేదా నిద్ర లేకపోవడం వల్ల మీకు అలసిపోయినట్లు అనిపించవచ్చు. మహిళల్లో.. ఇది గుండెపోటుకు ప్రధాన సంకేతంగా పరిగణించబడుతుంది. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం.. ఛాతీ నొప్పి, దవడ నొప్పి లేదా ఎడమ చేతిలో నొప్పితో పాటు అలసటగా అనిపిస్తే.. ఇలాంటి లక్షణాలపై శ్రద్ధ వహించాలి. అలసట అనేది గుండె రక్తాన్ని పంప్ చేయడానికి అదనపు శ్రమించాల్సి రావడం వల్ల వస్తుంది.

అధిక చెమట: సాధారణం కంటే ఎక్కువగా చెమట పట్టడం, ముఖ్యంగా మీరు వ్యాయామం చేయకపోయినా లేదా శారీరకంగా ఎక్కువ పనిచేయకపోయినా కూడా చెమట పడితే.. అది గుండె సమస్యలకు సంబంధించిన ముందస్తు హెచ్చరిక కావచ్చు. మూసుకుపోయిన ధమనుల ద్వారా రక్తాన్ని పంప్ చేయడానికి మీ గుండె కష్టపడి పనిచేయాలి. కాబట్టి మీ శరీర ఉష్ణోగ్రతను తగ్గించడానికి ఎక్కువగా చెమట పడుతుంది. మీరు ఇతర లక్షణాలతో పాటు చలి, చెమట వంటి లక్షణాలను మీలో గమనిస్తే మాత్రం వెంటనే డాక్టర్‌ను సంప్రదించండి.