Published On:

Weight Gain Causes: స్ట్రెస్ ఎక్కువగా ఉంటే.. బరువు పెరుగుతారా ?

Weight Gain Causes: స్ట్రెస్ ఎక్కువగా ఉంటే.. బరువు పెరుగుతారా ?

Weight Gain Causes:  సాధారణంగా ఒక వ్యక్తి బరువు పెరగడానికి అనేక కారణాలు ఉంటాయి. ఒత్తిడి కూడా బరువు పెరగడానికి కారణమవుతుందా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. దీనికి సమాధానం అవును అనే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఒత్తిడి నేరుగా బరువు పెరగడానికి కారణం అవుతుందని చెబుతున్నారు. మనం ఒత్తిడికి గురైనప్పుడు.. అది మన శరీరం , మానసిక స్థితిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. అంతే కాకుండా ఒత్తిడి శరీరంలో అనేక జీవసంబంధమైన, హార్మోన్ల మార్పులకు కూడా కారణమవుతుంది. ఇది బరువు పెరగడానికి దారితీస్తుంది.

కార్టిసాల్ : ఒత్తిడి సమయంలో.. శరీరం కార్టిసాల్ అనే ఒత్తిడి హార్మోన్‌ను ఉత్పత్తి చేస్తుంది. మనం ఒత్తిడికి గురైనప్పుడు.. ఈ హార్మోన్ శరీరంలో ఒక రకమైన ప్రతిస్పందనను ప్రేరేపిస్తుంది. అంతే కాకుండా తక్షణ ముప్పును ఎదుర్కోవడానికి శరీరాన్ని సిద్ధం చేయడం లక్ష్యంగా పనిచేస్తుంది. ఇదిలా ఉంటే శరీరంలో కార్టిసాల్ స్థాయి పెరిగినప్పుడు నడుము, పొట్ట క్రింది భాగంలో కొవ్వు పేరుకుపోవడం వేగవంతం అవుతుంది. మీరు ఒత్తిడికి గురైనప్పుడు ముఖ్యంగా బెల్లీ ఫ్యాట్ పెరుగుతుంది.

అతిగా తినడం: ఒత్తిడిలో ఉన్నప్పుడు.. తరచుగా చాక్లెట్, బంగాళాదుంప చిప్స్, బర్గర్లు, ఐస్ క్రీం, ఇతర అధిక కేలరీలు ఉన్న ఆహారాల పదార్థాలను చాలా మంది తినడానికి ఇష్టపడతారు. అయితే ఇలాంటి ఫుడ్ లో చక్కెర , కొవ్వుపదార్థాలు అధిక మోతాదులో ఉంటాయి. ఇవి శరీరంలో కొవ్వు పేరుకుపోవడానికి దారితీస్తాయి.

నిద్ర లేకపోవడం: ఒత్తిడి కారణంగా నిద్ర కూడా ప్రభావితమవుతుంది. మీరు సరిగ్గా నిద్రపోయిప్పుడు మాత్రమే శరీరంలో జీవక్రియలు సమక్రమంగా జరిగి కేలరీలు బర్న్ అవుతాయి. కానీ నిద్ర లేకపోవడం వల్ల లెప్టిన్ , గ్రెలిన్ వంటి హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. ఈ రెండు హార్మోన్లు.. ఆకలి, సంతృప్తిని నియంత్రిస్తాయి. ఒత్తిడి , నిద్ర లేకపోవడం వంటివి ఆకలిని పెంచుతాయి. ఎక్కువగా తినాలనే కోరుకను కూడా కలిగిస్తాయి.

శారీరక శ్రమ: మీరు ఒత్తిడికి గురైనప్పుడు.. మీ శక్తి స్థాయిలు తగ్గుతాయి. ఒత్తిడి మిమ్మల్ని అలసిపోయేలా చేస్తుంది. అంతే కాకుండా మానసికంగా బలహీనంగా మారుస్తుంది. ఇది మిమ్మల్ని చురుకుగా ఉండకుండా నిరోధిస్తుంది.