Mosambi For Weight Loss: ఎంతటి బెల్లీ ఫ్యాట్ అయినా.. కరిగించే బెస్ట్ ఫ్రూట్ ఇదే !

Mosambi For Weight Loss: వేసవిలో ఎక్కువ వేడి కారణంగా.. శరీరం అలసిపోయి, డీహైడ్రేషన్‌కు గురైనప్పుడు, బత్తాయి తినడం చాలా మంచిది. ఇది శరీరాన్ని చల్లబరుస్తుంది . అంతే కాకుండా బరువు తగ్గించడంలో కూడా చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ముఖ్యంగా మీరు బెల్లీ ఫ్యాట్‌తో బాధపడుతుంటే..మీరు బత్తాయిని తరచుగా తినడం వల్ల అద్భుత ప్రయోజనాలు ఉంటాయి. మరి బరువు తగ్గడానికి బత్తాయి ఎలా, ఎప్పుడు తినాలో తెలుసుకుందామా..
బత్తాయి జ్యూస్ ఉదయం ఖాళీ కడుపుతో తాగడం వల్ల జీవక్రియ మెరుగుపడుతుంది. ఇందులో ఉండే విటమిన్ సి, డైటరీ ఫైబర్ శరీరం నుండి వ్యర్థ పదార్థాలను తొలగించి, బెల్లీ ఫ్యాట్ ను తగ్గించడంలో సహాయపడతాయి. దీనిని గోరువెచ్చని నీటిలో కలిపి తీసుకోవడం మరింత ప్రయోజనకరంగా ఉంటుంది.
బత్తాయితో ఫ్రూట్ సలాడ్ : భోజనానికి ముందు బత్తాయిని సలాడ్‌గా తినడం వల్ల కడుపు నిండుగా ఉండి, అన్నం అతిగా తినకుండా నిరోధిస్తుంది. అంతే కాకుండా బొప్పాయి, పుచ్చకాయ, దోసకాయలతో కలిపి బత్తాయి తినడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. దీని రుచి అద్భుతంగా ఉంటుంది. ఇది మీ బరువును కూడా నియంత్రణలో ఉంచుతుంది.
వ్యాయామం తర్వాత : వ్యాయామం తర్వాత శరీరానికి రిఫ్రెష్మెంట్ అవసరమైనప్పుడు.. బత్తాయి జ్యూస్ సహజంగానే మీకు శక్తిని ఇస్తుంది. అంతే కాకుండా కండరాల పని తీరును మెరుగుపరుస్తుంది. చక్కెర కలపకుండా స్వచ్ఛమైన బొప్పాయి జ్యూస్ తాగడం చాలా మంచిది.
రాత్రి భోజనానికి ముందు: రాత్రి భోజనానికి ముందు ఆకలిగా ఉండి, అనారోగ్యకరమైన స్నాక్స్ తినే బదులు కొన్ని బత్తాయి ముక్కలు తినండి. ఇది మీకు కడుపు నిండిన భావనను కలిగిస్తుంది. అంతే కాకుండా మీ శరీరానికి అదనపు కేలరీలు లేకుండా పోషణ లభిస్తుంది.
డీటాక్స్ డ్రింక్ : కొన్ని పుదీనా ఆకులు, ఒక చిన్న అల్లం ముక్క , కాస్త బత్తాయి రసం నీటిలో కలిపి రోజంతా కొద్ది కొద్దిగా తాగాలి. ఇది శరీరాన్ని డీటాక్స్ చేసి జీవక్రియను వేగవంతం చేస్తుంది. ఇలా చేయడం ద్వారా బెల్లీ ఫ్యాట్ కూడా క్రమంగా తగ్గడం ప్రారంభమవుతుంది.
ఆకలిని తగ్గిస్తుంది: బత్తాయిలో ఉండే ఫైబర్ ఎక్కువసేపు కడుపు నిండుగా ఉండేలా చేస్తుంది. అదనపు కేలరీలు తీసుకోకుండానే రోజంతా చురుకుగా ఉండేందుకు ఉపయోగపడుతుంది.
తియ్యటి పదార్థాలు: మీకు స్వీట్లు తినే అలవాటు ఉంటే.. దానికి బత్తాయి ఒక గొప్ప ప్రత్యామ్నాయం కావచ్చు. దీని తీపి , పుల్లని రుచి మనసును సంతృప్తిపరుస్తుంది.
బెల్లీ ఫ్యాట్ కరిగించడం: బత్తాయిలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. కానీ పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఉండే విటమిన్ సి, ఐరన్, పొటాషియం బెల్లీ ఫ్యాట్ తగ్గించడంలో సహాయపడతాయి. దీనిని రోజూ తీసుకోవడం వల్ల బెల్లీ ఫ్యాట్ క్రమంగా తగ్గడం ప్రారంభమవుతుంది.
మీరు బెల్లీ ఫ్యాట్ తో బాధపడుతుంటే , బరువు తగ్గడానికి సహజ మార్గాలను చూస్తున్నట్లయితే, ఖచ్చితంగా మీ ఆహారంలో బత్తాయిని చేర్చుకోండి. దీన్ని పరిమిత పరిమాణంలో తీసుకుంటేనే పూర్తి ప్రయోజనాలను పొందుతారని గుర్తుంచుకోండి.