Published On:

Kodali Nani: కొడాలి నాని అసమర్థుడు – వైసీపీ నేత సంచలన కామెంట్స్, వీడియో వైరల్‌

Kodali Nani: కొడాలి నాని అసమర్థుడు – వైసీపీ నేత సంచలన కామెంట్స్, వీడియో వైరల్‌

YCP Leader Slams Ex MLA Kodali Nani: మాజీ మంత్రి కొడాలి నాని అసమర్థుడని.. ఆయనను నమ్మి మోసపోయానంటూ వైసీపీ కీలక నేత, కృష్ణా జిల్లా వైసీపీ మైనార్టీ సెల్ అధ్యక్షుడు మహమ్మద్ ఖాసిం అలియాస్‌ అబూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు అతడు మాట్లాడిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో ఆయన కొడాలి నాని తీరుపై అసహనం వ్యక్తం చేశాడు.

 

కొడాలి నాని నమ్మక ద్రోహి అని, తనని నమ్మి గెలిపించిన గుడివాడ ప్రజలు ఇబ్బందులు పడుతున్న వారిని పట్టించుకోకుండ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడంటూ ఆయనపై ధ్వజమెత్తారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్టీ శ్రేణులను గాలికి వదిలేశారని, వైపీసీ కార్యకర్తలు, నేతల కష్టాలను పట్టించుకునేవారే లేరంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వరదల కారణంగా నందివాడ మండలం మునిగిపోయి.. ప్రజలు కష్టాలు పడుతున్నా కొడాలి నాని అటువైపు కన్నెత్తి కూడా చూడలేదని మండిపడ్డారు. కానీ, గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, ఆయన అనుచరులు వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించింది వారికి అండగా నిలిచారని పేర్కొన్నారు.

 

రాజకీయాలకే కొత్త నిర్వచనంగా.. ఎమ్మెల్యే రాము నిత్యం ప్రజల మధ్య ఉంటూ.. వారి సమస్యలను పరిష్కరిస్తూ ప్రజా సేవ చేస్తున్నారంటూ కొనియాడారు. అసెంబ్లీ ఎన్నికల అనంరతం వెనిగండ్ల రాము.. అమెరికా పారిపోతాడంటే తామంత నమ్మామన్నారు. ఆయన దుష్పచారం చేసి తమని తప్పుదోవ పట్టించిన కొడాలి నాని ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే రాముపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు గానూ తాము క్షమాపణలు చెబుతున్నట్టు అబూ ప్రకటించారు. ఇకపై తాను రాజకీయాలను దూరంగా ఉంటానని కీలక ప్రకటన చేశారు. అయితే ఈ వీడియోలో అబూ చేసిన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో, ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.