Published On:

POLYCET: ఏపీ పాలిసెట్ ఫలితాలు రిలీజ్.. ఇలా చెక్ చేసుకోండి

POLYCET: ఏపీ పాలిసెట్ ఫలితాలు రిలీజ్.. ఇలా చెక్ చేసుకోండి

Andhra Pradesh: ఏపీలోని పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన పాలిటెక్నిక్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (పాలిసెట్) 2025 ఫలితాలు రిలీజయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రిజల్ట్స్ విడుదల చేశారు. ఏప్రిల్ 30న జరిగిన ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 1,39,840 మంది విద్యార్థులు హజరయ్యారు. వీరిలో 1,33,358 మంది క్వాలిఫై అయ్యారు. ఉత్తీర్ణత శాతం 95.36 గా ఉందని అధికారులు తెలిపారు. ఫలితాల్లో బాలికలు సత్తా చాటారని చెప్పారు. అత్యధికంగా అల్లూరి సీతారామారాజు జిల్లాలో 98.66 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 19 మంది విద్యార్థులు 120 మార్కులు సాధించినట్టు మంత్రి లోకేష్ తెలిపారు. పరీక్షలో క్వాలిఫై అయిన విద్యార్థులకు అభినందనలు చెప్పారు.  కాగా కౌన్సిలింగ్, సీట్ల భర్తీ వంటి షెడ్యూల్ ను త్వరలోనే ప్రకటిస్తామని ఉన్నత విద్యాశాఖ అధికారులు తెలిపారు.

విద్యార్థులు తమ ఫలితాలను http://polycetap.nic.in/ వెబ్ సైట్ ఓపెన్ చేయాలి. ముందుగా హాల్ టికెట్ నెంబర్, డీటెయిల్స్ ను సబ్మిట్ చేసి ఫలితాలు పొందొచ్చు.