Andhra Pradesh: ఏలూరు జిల్లాలో విషాదం.. చెరువులో పడి ముగ్గురు యువకుల మృతి

Eluru: ఏపీలో మరో విషాదకర ఘటన జరిగింది. అన్నమయ్య జిల్లాలో ఈతకెళ్లి ఐదుగురు బాలురు మృతిచెందిన ఘటన మరువక ముందే మరో విషాద ఘటన జరిగింది. ఏలూరు జిల్లా భీమడోలు మండలం కోమటిగుంట వద్ద చెరువులో మునిగి ముగ్గురు మృతిచెందారు.
పెదలింగంపాడులో ఓ వేడుకకు హాజరైన నలుగురు యువకులు తిరుగు ప్రయాణంలో కోమటిగుంట చెరువు వద్ద ఆగారు. ముగ్గురు చెరువులోకి దిగగా.. ప్రమాదవశాత్తు నీటిలో మునిగి చనిపోయారు. మృతులను పెదవేగి మండలం వేగివాడ గ్రామానికి చెందిన అజయ్, అభిలాష్, సాగర్ గా గుర్తించారు. మరో యువకుడి సమాచారంతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని స్థానికుల సాయంతో గాలింపు చేపట్టి యువకుల మృతదేహాలను బయటకు తీశారు. పోస్ట్ మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఘటనపై వివరాలు ఆరా తీస్తున్నారు. కాగా యువకుల మృతితో గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి.