Published On:

Telangana Welfare Hostel Students: విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఇక నుంచి కాస్మోటిక్ ఛార్జీలకు స్మార్ట్ కార్డులు

Telangana Welfare Hostel Students: విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఇక నుంచి కాస్మోటిక్ ఛార్జీలకు స్మార్ట్ కార్డులు

Telangana Key Statements For Smart Cards For Welfare Hostel Students : విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇక నుంచి ప్రభుత్వ హాస్టల్ విద్యార్థులకు కాస్మోటిక్ ఛార్జీల కోసం స్మార్ట్ కార్డులు అందించేందుకు చర్యలు చేపట్టింది. ఈ మేరకు డెబిట్‌ కార్డు తరహాలో స్మార్ట్‌ కార్డులను ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు. సబ్బులు, షాంపూలు, ఇతర వస్తువులను కొనుగోలు చేసేందుకు స్మార్ట్ కార్డులను వినియోగించేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు.

 

రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మెరుగైన సేవలు అందించే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే సోషల్, మైనార్టీ, ట్రైబల్ వెల్ఫేర్‌తో పాటు అన్ని రెసిడెన్షియల్ హాస్టళ్లో రుచికరమైన భోజనం అందించడంతో పాటు మెరుగైన మౌలిక వసతులు కల్పనలో భాగంగా సదుపాయాలు కల్పించాలని ఆదేశాలు జారీ చేసింది.

 

ఈ మేరకు హాస్టల్ విద్యార్థులకు కాస్మోటిక్ చార్జీల విషయంలో కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతున్నవారు. ఈ ఛార్జీలను విద్యార్థులకు నేరుగా అకౌంట్‌లోకి పంపించేలా చర్యలు చేపడుతున్నారు. తొలుత విద్యార్థుల పేరిట కొత్త అకౌంట్లను ఓపెన్ చేసి ఆ తర్వాత డబ్బులు పంపించేలా ఆలోచిస్తున్నారు. ఇలా వారికి స్మార్ట్ కార్డులు అందించి వస్తువులను తీసుకునేలా నిర్ణయం తీసుకుంటున్నారు.

 

మరోవైపు విద్యార్థులకు కావాల్సిన అన్ని వస్తువులను మహిళా సంఘాలతో అటాచ్ చేసి అందించేలా ప్లాన్ చేస్తున్నారు. విద్యార్థులకు ప్రధానంగా స్కూల్ డ్రెస్, పుస్తకాలు, బెడ్ షీట్స్, కార్పెట్స్, బ్యాగ్స్, పెన్నులు, సబ్బులు, ఇతర వస్తువులను అందిస్తుండగా.. వీటికి ప్రతిపాదనలో భాగంగా నేరుగా ఖాతాల్లో డబ్బులు జమ చేసేలా నిర్ణయించింది. ఇందు కోసం స్మార్ట్ కార్డులు అందించి మహిళా సంఘాల ద్వారా విద్యార్థులకు నేరుగా కాస్మోటిక్ వస్తువులు కొనుగోలు చేసేలా ప్రభుత్వం భావిస్తోంది.