Published On:

ISRO PSLV-C61: ఇస్రో రెడీ.! రేపే పీఎస్ఎల్వీ సి-61 రాకెట్ ప్రయోగం

ISRO PSLV-C61: ఇస్రో రెడీ.! రేపే పీఎస్ఎల్వీ సి-61 రాకెట్ ప్రయోగం

 

  • ఉదయం 7.59 గంటలకి ప్రారంభమైన కౌంట్ డౌన్ ప్రక్రియ
  • రేపు ఉదయం 5.59 గంటలకి నింగిలోకి దూసుకెళ్లనున్న పీఎస్ఎల్వీ సీ-61
  • ఈ రాకెట్ ద్వారా రీశాట్ -1బి ఉపగ్రహాన్ని కక్ష్యలోకి పంపనున్న శాస్త్రవేత్తలు
PSLV-C61 launch: ఇస్రో మరో ప్రయోగానికి సిద్ధమైంది. రేపు పీఎస్ఎల్వీ సి-61 రాకెట్ ప్రయోగం చేపట్టనుంది. ఉదయం 7 గంటల 59 నిమిషాలకు కౌంట్ డౌన్ ప్రక్రియ ప్రారంభమైంది. రేపు ఉదయం 5 గంటల 59 నిమిషాలకు పీఎస్ఎల్వీ సీ-61 నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ రాకెట్ ద్వారా రీశాట్ -1బి ఉపగ్రహాన్ని శాస్త్రవేత్తలు కక్ష్యలోకి పంపనున్నారు.

 

ఈఓఎస్ సిరీస్ కంటే ఈ ఉపగ్రహంలో అత్యాధునిక పేలోడ్స్‌ని ఇస్రో అమర్చింది. భారత రక్షణ వ్యవస్థకు రీశాట్ 1బి ఉపగ్రహం కీలకం కానుంది. పగలు, రాత్రి విభిన్న వాతావరణంలోనూ హై రెసెల్యూషన్‌తో భూమిపై ఫొటోలు రీశాట్ -1బి పంపనుంది. ఉపగ్రహంలో సీ బ్యాండ్ సింథటిక్ అపార్చర్ ర్యాడర్‌ని ఇస్రో అమర్చింది. భారత భూభాగానికి అవతల ఉగ్రస్థావరాలు. శత్రు సైన్యాల కదలికలు ఎప్పటికప్పుడు అధ్యయనం చేయనుంది. ఈఓఎస్ సిరీస్‌లో ఇది తొమ్మిదో ఉపగ్రహం.

 

ప్రస్తుత పరిస్థితుల్లో భారత సైన్యానికి అన్ని విధాలుగా ఈఓఎస్ సిరీస్ ఉపగ్రహాలు ఉపయోగపడుతున్నాయి. నిరంతరం అంతరిక్షం నుంచి ఉగ్ర కార్యకలాపాలు, స్థావరాలని ఉపగ్రహాలు గుర్తిస్తున్నాయి. మరోవైపు ప్రయోగం నేపథ్యంలో షార్ వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే షార్‌కి ఇస్రో చైర్మన్ వి. నారాయణన్, శాస్త్రవేత్తలు చేరుకున్నారు.

ఇవి కూడా చదవండి: