Last Updated:

Prasad’s Imax: దేశంలోనే అతిపెద్ద సినిమా తెర.. ఎక్కడంటే..?

హైదరాబాద్ లో మల్టీప్లెక్స్ థియేటర్ అనగానే అందరికీ గుర్తొచ్చేది ప్రసాద్స్ ఐమాక్స్. సిటీలోనే పెద్ద స్క్రీన్ గా ఈ ఐమాక్స్ థియేటర్ కి పేరుంది. కాగా వీక్షకులకు మరింత పెద్దతెరపై సినిమా చూపించాలని దేశంలోనే అతి పెద్ద తెరను ప్రేక్షకులకు అందుబాటులోకి తేనున్నారు.

Prasad’s Imax: దేశంలోనే అతిపెద్ద సినిమా తెర.. ఎక్కడంటే..?

Prasad’s Imax: నేటి సమాజంలో మ‌ల్టీప్లెక్స్ కల్చర్ ట్రెండ్ అవుతుంది. ముఖ్యంగా హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో సింగిల్ స్క్రీన్ థియేటర్లకు వెళ్లేందుకు ప్రజలు అంతగా ఆసక్తి కనపరచడం లేదనే చెప్పాలి. రేటు కాస్త ఎక్కువైనా సరే ప్రేక్షకులు మల్టీప్లెక్సుల్లో సినిమా చూసేందుకే ఇష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు మల్టీప్లెక్సులు రకరకాల సౌకర్యాలు కల్పిస్తున్నాయి.

హైదరాబాద్ లో మల్టీప్లెక్స్ థియేటర్ అనగానే అందరికీ గుర్తొచ్చేది ప్రసాద్స్ ఐమాక్స్. సిటీలోనే పెద్ద స్క్రీన్ గా ఈ ఐమాక్స్ థియేటర్ కి పేరుంది. కాగా వీక్షకులకు మరింత పెద్దతెరపై సినిమా చూపించాలని ఐమాక్స్ యాజమాన్యం భావించింది. దానికి అనుగుణంగానే మరికొన్ని రోజుల్లో ఈ ఐమాక్స్ లో దేశంలోనే అతి పెద్ద తెరను ప్రేక్షకులకు అందుబాటులోకి తేనున్నారు. ఈ స్క్రీన్ 64 అడుగుల ఎత్తు, 101.6 అడుగుల వెడల్పుతో ఉంది. దాంతో, ఇది భారత దేశంలో అతి పెద్ద సినిమా తెరగా రికార్డుకెక్కింది. కెనడాకు చెందిన ‘స్ట్రాంగ్ ఎండీఐ’ అనే ప్రొజెక్షన్ స్క్రీన్ల తయారీ సంస్థ ప్రత్యేకంగా ఈ తెరను రూపొందించింది. అంతే కాకుండా ఐమాక్స్ లో అత్యుత్తమైన సౌండ్ సిస్టమ్ ను కూడా ఏర్పాటు చేశారు. డిసెంబర్ 16న అవ‌తార్ 2 విడుదల నాటికి ఈ తెర ప్రేక్షకులకు అందుబాటులోకి రానుందని ఐమాక్స్ యాజమాన్యం స్ఫష్టం చేసింది.

ఇదీ చదవండి: హైదరాబాద్ ప్రజలకు అలెర్ట్.. ఆ ప్రాంతంలో 3 నెలలు ట్రాఫిక్ ఆంక్షలు

ఇవి కూడా చదవండి: