Hyderabad: బంగ్లాదేశీ అరెస్ట్… ఆధార్, ఓటర్, పాన్ కార్డులు లభ్యం

హైదరాబాద్‌లో ఓ బంగ్లాదేశ్ జాతీయుడిని పోలీసులు అరెస్టు చేశారు. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఐటీ కారిడార్‌లో అక్రమంగా ప్రవేశించిన బంగ్లాదేశ్‌కు చెందిన రషెల్ షేక్‌ను పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు. నిందితుడు రషెల్ షేక్ ఫోర్జరీ చేసి భారత ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, పాన్ కార్డులను రూపొందించినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడి నుంచి కోవిడ్ 19టీకా వేయించుకున్న ధృవపత్రం, బంగ్లాదేశ్ ఓటర్ కార్డు, ఒక ఫోన్, రెండు సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు.
అక్రమంగా భారత్ లోకి చొరబడ్డ విదేశీయులకు ఓటర్, ఆధార్, పాన్ కార్డులు ఎలా లభ్యమవుతున్నయో తెలియడం లేదు. వీరి వెనక ఉంది ఎవరన్న సంగతి ప్రశ్నార్థకంగా మారింది.
ఏప్రిల్ 22న పహల్గాం ఉగ్రదాడి జరిగిన తర్వాత పాకిస్థాన్ తో భారత్ దౌత్యపరమైన నిర్ణయాలను తీసుకుంది. దాడికి పాల్పడిన తీవ్రవాదులు, వారిని వెనకుండి నడిపించిన వారిని విడిచి పెట్టే ప్రసక్తే లేదని ప్రధాని మోదీ తెలిపారు. పాకిస్థాన్ నాలుగు రోజులనుంచి కవ్వించే చర్యలు చేస్తున్నా భారత్ తీవ్రంగా స్పందించడంలేదు. అయితే పహల్గాం దాడికి ప్రతీకారంగా కేంద్రం విస్త్రుత స్థాయి చర్యలు జపుపుతోంది. ఇజ్రాయిల్ నుంచి భారత్ కు ఫైటర్ జెట్స్ చేరుకున్నాయి.
భారత్ తప్పకుండా ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఉందని అన్నారు పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా మహమ్మద్. దాడి చేసే అవకాశాలు ఉన్నందునే సరిహద్దుల్లో అదనపు బలగాలను మోహరించామన్నారు. దేశ రక్షణకు ముప్పు ఉందని భావిస్తే అణ్వాయుదాలను వినియోగిస్తామని అన్నారు. తుర్కియోకు చెందిన పలు ఆర్మీ రవాణా విమానాలు ఇస్లామాబాద్ కు చేరాయి.