Last Updated:

Kaala Bhairava : రామ్ చరణ్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి క్షమాపణలు చెప్పిన కాలభైరవ.. కారణం ఏంటంటే?

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ అవార్డు రావడం పై యావత్ భారత దేశ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ పాటకు చంద్రబోస్ లిరిక్స్ అందించగా.. కీరవాణి మ్యూజిక్ చేశారు. కాల భైరవ, రాహుల్ సిప్లీగంజ్ అద్బుతంగా ఆలపించిన ఈ పాటని ఎన్టీఆర్, రామ్ చరణ్ తమ స్టెప్పులతొ ప్రపంచం అంతా ఫిదా అయ్యేలా చేశారు.

Kaala Bhairava : రామ్ చరణ్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి క్షమాపణలు చెప్పిన కాలభైరవ.. కారణం ఏంటంటే?

Kaala Bhairava :  దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ అవార్డు రావడం పై యావత్ భారత దేశ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ పాటకు చంద్రబోస్ లిరిక్స్ అందించగా.. కీరవాణి మ్యూజిక్ చేశారు. కాల భైరవ, రాహుల్ సిప్లీగంజ్ అద్బుతంగా ఆలపించిన ఈ పాటని ఎన్టీఆర్, రామ్ చరణ్ తమ స్టెప్పులతొ ప్రపంచం అంతా ఫిదా అయ్యేలా చేశారు. ఇక ఇటీవల ఈ సాంగ్ ఆసక్ర ని అందుకోవడం పట్ల ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తాయి. దీంతో మూవీ టీమ్ ఆనందానికైతే అవధులు లేవు అని చెప్పాలి. ఇక అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో గల డాల్బీ థియేటర్ లో  మార్చి 13న ఆస్కార్స్ వేడుక అట్టహాసంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ వేడుకకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బిగ్గెస్ట్ స్టార్స్ హాజరయ్యారు. వేదికపై ‘నాటు నాటు’ లైవ్ మ్యూజిక్ పెర్ఫామెన్స్ తో కాల భైరవ, రాహుల్ సిప్లిగంజ్ అదరగొట్టారు. వారి పర్ఫామెన్స్ కి అందరూ స్టాండింగ్ ఒవేషన్ కూడా ఇవ్వడం మరింత ప్రత్యేకతని సంతరించింది.

ఇంతకీ అసలు ఏమని రాసుకొచ్చాడంటే (Kaala Bhairava)..

ఇక అమెరికా నుంచి ఇండియా తిరిగి వచ్చిన తర్వాత సింగర్ కాల భైరవ ఆస్కార్ వేదికపై లైవ్ ప్రదర్శన ఇవ్వడం పట్ల స్పందిస్తూ ఇటీవల తన సోషల్ మీడియా ఖాతాలో ఓ నోట్ రాశారు. ఆస్కార్ వేదికపై ‘నాటు నాటు’ పాటకు లైవ్ ప్రదర్శన ఇవ్వడం తనకెంతో సంతోషంగా ఉందని అన్నారు. ఆర్ఆర్ఆర్’కు ప్రాతినిధ్యం వహించి.. ఉత్తమ ఒరిజినల్ సాంగ్ కేటగిరీ కోసం ఆస్కార్స్ లో ప్రదర్శన ఇచ్చే అమూల్యమైన అవకాశాన్ని కలిగినందుకు చాలా కృతజ్ఞతుడిగా భావిస్తున్నాను. ఇందుకు ప్రత్యక్షంగా, పరోక్షంగా అందరూ సహకరించడం వల్లే ఇది సాధ్యమైంది. ఎస్ఎస్ రాజమౌళి బాబా, నాన్న, ప్రేమ్ రక్షిత్ మాస్టర్, ఎస్ఎస్ కార్తీకేయ అన్న.. వారి కృషి మరియు పనితనం వల్లనే ఈ పాట ప్రపంచంలోని అన్ని ప్రాంతాలకు చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులను, సంగీత ప్రియులతో డాన్స్ చేయించింది సాంగ్. అలాగే, యూఎస్ఏ లో గ్లోరియస్ రన్  కోసం డైలాన్, జోష్ వారి టీమ్ నిరంతర కృషి,  అంకితభావం వల్లే ఇది సాధ్యమైంది. అంటూ సుధీర్ఘమైన థ్యాంక్యూ నోట్ రాసుకొచ్చారు.

(Kaala Bhairava) ఆర్‌ఆర్‌ఆర్‌ విజయానికి తారక్‌ అన్న, చరణ్‌ అన్నలే కారణం..

అయితే ఆ నోట్ లో ఎన్టీఆర్, చరణ్ గురించి ప్రస్తావించకపోవడం పట్ల చరణ్, తారక్ ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. దీంతో వెంటనే సారీ చెబుతూ కాలభైరవ మరో ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ లో ‘నాటు నాటూ’, ఆర్‌ఆర్‌ఆర్‌ విజయం తారక్‌ అన్న, చరణ్‌ అన్నలే కారణమని చెప్పడంలో నాకెలాంటి సందేహం లేదు. అయితే అకాడమీ స్టేజ్ పెర్ఫార్మెన్స్‌లో అవకాశం రావడానికి నావైపుగా ఎవరెవరకు సహకరించారు అనే దాని గురించి మాత్రమే నేను మాట్లాడాను. అంతకు మించి ఇంకేమి లేదు. కానీ తప్పుగా కన్వే అయ్యింది. ఇందుకు హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నాను.. అంటూ కాల భైరవ ట్వీట్ చేశారు. ప్రస్తుతం కాలభైరవ ట్వీట్ ల విషయం హాట్ టాపిక్ గా మారింది.