Published On:

Singer Pravasthi Aaradhya: ‘పాడుతా తీయగా’ జడ్జస్‌పై సంచలన ఆరోపణలు – బొడ్డు కింద చీర కట్టుకోమన్నారు.. బాడీ షేమింగ్‌ చేశారు: సింగర్‌ ఆవేదన

Singer Pravasthi Aaradhya: ‘పాడుతా తీయగా’ జడ్జస్‌పై సంచలన ఆరోపణలు – బొడ్డు కింద చీర కట్టుకోమన్నారు.. బాడీ షేమింగ్‌ చేశారు: సింగర్‌ ఆవేదన

Singer Pravasthi Aaradhya Sensational Comments on MM Keeravani: దివంగత లెజెండరీ గాయకులు ఎస్పీ బాలసుబ్రమణ్యం ప్రారంభించిన సింగింగ్‌ షో పాడుతా తీయగా సక్సెస్‌ ఫుల్‌గా కొనసాగుతోంది. ఇప్పటికే ఎన్నో సీజన్లు జరుపుకున్న ఈ షో ప్రస్తుతం ‘పాడుతా తీయగా’ సిల్వర్‌ జూబ్లీని జరుపుకుంటుంది. దీనికి ఆస్కార్‌ అవార్డు గ్రహిత ఎంఎం కీరవాణి, గేయ రచయిత సుభాష్‌ చంద్రబోస్‌, సింగర్‌ సునీతలు జడ్జీగా వ్యవహరిస్తున్నారు. ఎస్పీబీ తనయుడు ఎస్పీ చరణ్‌ ఈ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు.

 

తెరవెనక జడ్జస్ అన్యాయాలు

ప్రస్తుతం టాప్‌ వన్‌లో కొనసాగుతున్న ఈ షో ప్రొడక్షన్‌, జడ్జీస్‌పై ఇదే షోలో కంటెస్టెంట్‌గా పాల్గొన్న సింగర్‌ ప్రవస్తి ఆరాధ్య సంచలన ఆరోపణలు చేసింది. జడ్జిమెంట్‌ ఇచ్చేటప్పుడు ఎంఎం కీరవాణి గారు పక్షపాతంగా వ్యవహిరిస్తారంది. ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు ఉన్నప్పుడు పాడుతా తీయగా చాలా బాగా జరిగిందని, ఎలాంటి డ్రామాటిక్‌ లేకుండ సాఫీగా నడిచిందని చెప్పింది. అయితే ఈ సీజన్‌లో మాత్రం చాలా అన్యాయాలు జరుగుతున్నాయని, తనతో పాటు మరికొందరి విషయంలో జడ్జస్‌ పక్షపాతం చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. అంతేకాదు తనను దారుణంగా అవమానించారని, బాడీషేమింగ్‌ చేస్తూ హేళ చేశారంటూ షాకింగ్‌ విషయాలు బయటపెట్టింది.

 

అందుకే వారి పేర్లు బయటపెడుతున్నా..

ఈ మేరకు తన యూట్యూబ్‌లో ప్రవస్తి ఓ వీడియో రిలీజ్‌ చేసింది. ‘ఈ వీడియో చేయడానికి ముందు చాలా మంది నన్ను భయపెట్టారు. మరోక్కసారి ఆలోచించుకో.. నువ్వు ఇలా చేస్తే నీ కెరీర్‌కి ఎఫెక్ట్‌ అవుతుందని ఆపే ప్రయత్నం చేశారు. కానీ నేను అంత నిర్ణయించుకున్నాకే ఈ వీడియో చేస్తున్నాను. ఇక ఈ ఫీల్డ్‌ వదిలేద్దామనుకుంటున్నా. ఎందుకు ఈ వీడియో తర్వాత సింగర్‌ నాకు ఇక అవకాశాలు రావు. నా కెరీర్‌ అయిపోయనట్టే. ఎందుకు పెద్ద పెద్ద వాళ్ల పేర్లు బయటకు తీసుకువచ్చాను. అంతా నిర్ణయించుకునే ఈ వీడియో చేస్తున్నా. అయితే నాలాగే ఎంతో మంది ఇక్కడ అన్యాయానికి గురవుతున్నారు. వారందరు భయంతో రావట్లేదు. అలాంటి వాళ్లకు న్యాయం జరుగుతుందని, పెద్దవాళ్ల ముసుగులో వారు చేస్తున్న అన్యాయాలను బయటపెడదామనే ఈ వీడియో చేస్తున్నా’ అని చెప్పింది.

 

సునీత.. కనిపించినంత మంచిది కాదు

ముందుగా సింగర్‌ సునీత గారి గురించి చెబుతాను. సునీత గారు ఎంత అందంగా ఉంటారో అంతే కైండ్‌ హర్ట్‌తో ఉంటారని అంతా అనుకుంటారు. కానీ, బ్యూటీకి, కైండ్‌నెస్‌కి లింక్‌ ఉండదు. మీరు గమనించారో లేదో.. నేను ఎప్పుడు స్టేజ్‌పై వచ్చినా ఆమె ఒక రకంగా ఫేస్‌ పెడతారు. నా పాటల అన్నింటికి నెగిటివ్‌ కామెంట్స్‌ ఇస్తారు. ఈ విషయాన్ని నా ఫ్యాన్స్‌ చాలామంది అడిగారు. మీకు, సునీత మేడమ్‌కు ఏమైన అయ్యిందా అని కొందరు అడిగారు. ఆవిడ అలా కాదు.. చాలా మంచి వారితో వాదించాను. కానీ, ఒకరోజు ఆవిడ ఏంటో నాకు తెలిసింది. అంతా రామమయం పాట పాడుతున్న టైంలో నేను సౌండ్‌ చెక్‌ చేసుకుంటున్నాను. అప్పుడు నేను ఇన్‌ ఇయర్స్‌ పెట్టుకున్నా. అప్పుడు ఆవిడ దగ్గర ఒక మైక్‌ ఉంది. అది ఆన్‌లో ఉంది. అది ఆవిడకు తెలియదు. అప్పుడు కీరవాణి గారితో ఇలా అంటున్నారు. ‘ఈ అమ్మాయిది అసలు హై రేంజ్‌ వాయిసే కాదు. కానీ చాలా బాగా మ్యానేజ్‌ చేస్తుంది చూడండి’ అని నా గురించి ఏవేవో చెబుతుంది. అప్పుడు నాకు చాలా ఏడుపు వచ్చింది. కానీ, ఆపుకొని అంతరామమయం పాట పాడాను. దానికి అందరి నుంచి నాకు ప్రశంసలు వచ్చాయి. కానీ ఎప్పటిలాగే సునీత గారి నుంచి నెగిటివ్‌ కామెంట్స్‌ వచ్చాయి” అని ప్రవస్తి పేర్కొంది.

 

చంద్రబోస్ జడ్జిమెంట్ అన్యాయం..

“చంద్రబోస్‌ గారు ఆయన ఒక లిరిసిస్ట్‌. ఆయన పనే లిరిక్స్‌ తప్పులు ఉంటే చెప్పాలి. నా మొదటి పాటలకు మంచి కామెంట్స్‌ ఇచ్చారు. కానీ, క్రమంగా ఆయన కూడా నా పాటకు నెగిటివ్‌ కామెంట్స్‌ ఇవ్వడం మొదలు పెట్టారు. నేను ఎప్పుడు లిరిక్స్‌ మర్చిపోయేదాన్ని కాదు. ఆయన అసలు ఆ చాన్సే ఇచ్చేదాన్ని కాదు. కానీ, ఆయనేంటో కూడా రాముడు పాట రౌండ్‌లో బయటపడింది. లిరిక్స్‌ మిస్టెక్‌ చాన్స్‌ ఇవ్వలేదు. ఏ తప్పు దొరకలేక క్రియేట్‌ చేసి నా పాటలో ఆద్రుత లేదు అన్నారు. అదే రౌండ్‌లో కొంతమంది లిరిక్స్‌ మర్చిపోయారు, చేతిలో లిరిక్స్‌ రాసుకుని వచ్చారు. కానీ వారిని ఏం అనలేదు. పైగా మెచ్చుకున్నారు. కానీ నాకు మాత్రం లేని నెగిటివ్‌ని క్రియేట్‌ చేసి చెప్పారు. ఇది కూడా మీకు న్యాయం అనిపిస్తుందా?” అని ప్రవస్తి ప్రశ్నించారు.

 

కీరవాణి అసలు రూపం ఇది

ఇక కీరవాణి గారు.. “ఈయన అంటేనే నాకు చాలా ఆఇష్టం కలుగుతుంది. ఆయన నుంచి నాకు ఎప్పుడు నెగిటివ్‌ కామెంట్స్‌ రాలేదు. కానీ, పర్సనల్‌ ఆయన ఎలాంటి వ్యక్తి, ఎలా మాట్లాడతారనేది నేను మీకు ఇప్పుడు చెప్తాను. మెలోడిస్‌ పాడేవారు ఎలా పాడిన కూడా మార్క్‌ ఇస్తారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు. కీరవాణి గారే కాదు సునీత, చంద్రబోస్‌ గారు కూడా అంతే. వాళ్ల వాళ్ల పాటలు పాడిన వారికి మంచి మార్కులు ఇస్తారు. ఒకసారి కీరవాణి గారు ఒక మాట అన్నారు. అది నన్ను చాలా బాధించింది. ఆర్థిక అవసరాల కారణంగా నేను ఓ పెళ్లిలో పాటలు పాడానని నా ఫైనాన్షియల్‌ ఇష్యూ గురించి చెబుతూ ఈ మాట చెప్పాను.

నా ఎలిమినేషన్‌ ఎపిసోడ్‌లో ఆయన నన్ను చూస్తు ఒక మాట అన్నారు. ‘పెళ్లిళ్లలో పాటలు పాడేవారు నా దృష్టిలో అసలు సింగర్స్‌ కాదు’ అన్నారు. ఈ షోలో మూడో స్థానంలో వచ్చినవారికి ఆయనే స్వయంగా ఒక లక్ష ఇస్తాను అన్నారు. నాలుగో స్థానంలో వచ్చిన వారికి తన మూవీలో పాట పాడే అవకాశం, ఐదో స్థానంలో వచ్చిన వారికి ఆయన గ్రూప్‌లో చేర్చుకుంటాను అన్నారు. ఈ విషయాన్ని ఆయన ఇలా చెప్పారు. రోజు నా దగ్గరికి కొంతమంది వచ్చి చాకిరి చేస్తుంటారు. ఈ షోలో ఫిఫ్త్‌ ప్రైజ్‌ వచ్చిన వారిని ఆ గ్రూపులో చేర్చుకుంటాను’ అని అన్నారు. ఇక్కడ ఆయన చాకిరి అని వాడారు. ఇది అగౌరవ పరిచినట్టు కాదా?” అని చెప్పుకొచ్చింది.

 

బోట్టు కింద చీరకట్టుకోమన్నారు..

ఇక ప్రొడక్షన్‌ హౌజ్‌ గురించి చెబుతూ షాకింగ్‌ కామెంట్స్‌ చేసింది. జ్ఞాపిక ప్రొడక్షన్స్‌ అనిల్‌ గారు, ఆయన భార్య అంతా వారే చూసుకుంటారు. ఇక్కడ జరిగే వాటన్నింటికి మూల పాత్రదారులు వీరే. పాట సెలక్షన్స్‌ నుంచి రికార్డు వరకు అన్ని వారే చూసుకుంటారు. తమకు నచ్చినవాళ్లకు వారికి ఇష్టమైన పాటలనే ఇస్తారు. అదే నచ్చని వాళ్లకు చివరి నిమిషంలో పాటలు మార్చేస్తుంటారు. ఇక కాస్ట్యూమ్‌ డిజైనర్స్‌ అయితే చాలా దారుణంగా ప్రవర్తిస్తారు. బొడ్డు కిందకు చీర కట్టుకో, ఎక్స్‌పోజింగ్‌ చేయ్‌ అంటారు. పాటలు పాడేటప్పుడు ఊరికనే నిలుచోకుండ డ్యాన్స్‌లు చేయాలి అంటారు. ఒకరైతే ఈ బాడీకి ఇంతకంటే బెటర్‌గా కాస్ట్యూమ్‌ డిజైన్‌ చేయాలేను అంటూ బాడీ షేమింగ్‌ చేశారంటూ ప్రవస్తి ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఆమె కామెంట్స్‌ ఇండస్ట్రీలో సంచలనంగా మారాయి. మారి ఆమె కామెంట్స్‌కి ఇండస్ట్రీ నుంచి ఎలాంటి రెస్పాన్స్‌ రానుందనేది ఆసక్తిగా మారింది.