Actress Himaja: మణికొండలో నటి హిమజ సందడి – బ్యూటీ సెలూన్ గ్రీన్ ట్రెండ్స్ ప్రారంభించిన బిగ్‌బాస్ భామ
Actress Himaja Starts Green Trends Saloon in Manikonda: నటి, బిగ్‌బాస్ ఫేం హిమజ మణికొండ సందడి చేశారు. అక్కడ ప్రముఖ బ్యూటీ చెయిన్ సెలూన్.. గ్రీన్ ట్రెండ్ కొత్త బ్రాంచ్‌ను మణికొండలో ప్రారంభించింది. ఈ ప్రారంభొత్సవ కార్యక్రమానికి హిమజ ముఖ్య అతిథికి హాజరై సెలూన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ట్రెండ్ ఫ్రాంచైజీ ఓనర్ యమున, విజయ్‌తో పాటు ఏపీ తెలంగాణ గ్రీన్ ట్రెండ్స్ బిజినెస్ డెవలప్‌మెంట్ హరికృష్ణ పాల్గొన్నారు. అత్యాధునిక టెక్నాలజీతో హెయిర్ అండ్ స్టైలింగ్ ఇక్కడ అందుబాటులో ఉండనుంది.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న నటి హిమజ మాట్లాడుతూ.. ‘గ్రీన్ ట్రెండ్స్ గురించి నేను చెప్పాల్సిన పనిలేదు. దేశ వ్యాప్తంగా ఎన్నో బ్రాంచీలు ఉన్నాయి. ఇప్పుడున్న సొసైటీలో అందంగా కనిపించేందుకు ప్రతి ఒక్కరూ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఏదైనా చిన్న కార్యక్రమం ఉన్నా హెయిర్ నుంచి మేకప్ వరకు ప్రతి విషయంలో అందంగా ముస్తాబై వెళ్తున్నారు. అలాంటి వారికిగ్రీన్ ట్రెండ్స్ ది బెస్ట్ ఆప్షన్. ఇక్కడ హెయిర్, స్టైల్, మేకోవర్ చేసుకున్నాక నన్ను నేనే నమ్మలేనంత అందంగా తయారయ్యాను. మీరు కూడా గ్రీన్ ట్రెండ్స్‌లో మీకు నచ్చినట్లు మేకోవర్ కావొచ్చు. యమున, విజయ్ గారు గ్రీన్ ట్రెండ్స్ సెలెక్ట్ చేసుకోవడంలోనే సక్సెస్ అయ్యారు. వారు మరెన్నో ఫ్రాంఛైజీలు ఒపెన్ చేసి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా” అని చెప్పుకొచ్చింది.
ఆ తర్వాత గ్రీన్ ట్రెండ్స్ బిజినెస్ డెవలప్‌మెంట్ మేనేజర్ హరికృష్ణ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా మా గ్రీన్ ట్రెండ్స్ ఫ్రాంఛైజీలకు మంచి ఆదరణ వస్తోంది. తెలంగాణ, ఏపీలో దాదాపు వంద వరకు గ్రీన్ ట్రెండ్స్ ఫ్రాంఛైజీలు అందుబాటులో ఉన్నాయి. గ్రీన్ ట్రెండ్స్‌ని సెలెక్ట్ చేసుకోవడం వల్ల యమున, విజయ్ గారు ప్రారంభంలోనే విజయం సాధించినట్లు. హిమజ గారిది లక్కీ హ్యాండ్. ఆమె చేతుల మీదుగా మణికొండ ఫ్రాంఛైజీ ప్రారంభించుకోవడం సంతోషంగా ఉంది’ అన్నారు.
మణికొండ గ్రీన్ ట్రెండ్స్ ఫ్రాంఛైజీ ఓనర్ యమున మాట్లాడుతూ – మా గ్రీన్ ట్రెండ్స్ బ్రాంచ్‌ను మణికొండలో ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉందని, తమ కొత్త ఫ్రాంఛైజీ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా వచ్చిన హిమజకు ధన్యవాదాలు తెలిపారు. తాము ఎన్నో కంపెనీస్ చూశామని, కానీ గ్రీన్ ట్రెండ్స్ తమకు బాగా నచ్చిందన్నారు. వారు ఎంతో సపోర్టు ఇస్తున్నారని, ప్రతి విషయంలోనూ అందుబాటులో ఉన్నారన్నారు. మా గ్రీన్ ట్రెండ్స్ కు వచ్చేవారికి కంప్లీట్ మేకోవర్ హై క్వాలిటీతో ఇస్తామని ప్రామిస్ చేస్తున్నామని ఆమె పేర్కొన్నారు.
మణికొండ గ్రీన్ ట్రెండ్స్ ఫ్రాంఛైజీ ఓనర్ విజయ్ మాట్లాడుతూ.. తమ ఫ్రాంఛైజీ ప్రారంభోత్సవానికి అతిథిగా నటి హిమజకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రీన్ ట్రెండ్స్ ఎంత ప్రసిద్ధి చెందిందో మీకు తెలుసు.. ఇక్కడ మణికొండ వాసులకు మా ఫ్రాంఛైజీ గ్రీన్ ట్రెండ్స్ అందుబాటులోకి తీసుకొస్తున్నామన్నారు. తమ సంస్థకు ఎంతో సహకారం అందిస్తున్న, ప్రతి విషయంలో సపోర్ట్ చేస్తున్నావారికి ధన్యవాదాలు తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- Janu Lyri Second Marriage: చనిపోతానంటూ వీడియో.. అంతలోనే రెండో పెళ్లి ప్రకటన – కాబోయే భర్త ఫోటో షేర్ చేసిన జాను లిరి