Published On:

India Vs England 2nd T20: రెండో టీ20లోనూ భారత్ ఘన విజయం

రెండో టీ20లోనూ భారత్ ఘన విజయం సాధించింది. దీంతో టీ20 సిరీస్ భారత్ కైవసం అయ్యింది. బర్మింగ్ హామ్ వేదికగా జరిగిన రెండో టీ20లో టీమిండియా 49 పరుగులతో గెలిచింది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్. ముందుగా భారత్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది.

India Vs England 2nd T20: రెండో టీ20లోనూ భారత్ ఘన విజయం

India won the 2nd T20 against with England: రెండో టీ20లోనూ భారత్ ఘన విజయం సాధించింది. దీంతో టీ20 సిరీస్ భారత్ కైవసం అయ్యింది. బర్మింగ్ హామ్ వేదికగా జరిగిన రెండో టీ20లో టీమిండియా 49 పరుగులతో గెలిచింది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్. ముందుగా భారత్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. ఓపెనర్లు రోహిత్, పంత్ దూకుడుగా ఆడారు. రోహిత్ 31, పంత్ 26 పరుగులు చేయగా, ఫస్ట్ డౌన్ లో వచ్చిన విరాట్ కోహ్లీ మాత్రం నిరాశ పరిచాడు. మిడిలార్డర్ లో సూర్యకుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్య విఫలం అయ్యిరు. చివర్లో జడేజా మెరుపు ఇన్నింగ్ ఆడాడు. జడేజా 29 బంతుల్లో 46 పరుగులతో సత్తా చాటడంతో భారత్ నిర్ణిత ఓవర్లలో 170 పరుగులు చేసింది.

 

అనంతరం బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లాండ్ జట్టులో మొయిన్ అలీ 35, డేవిడ్ విల్లీ 33 పరుగులు మినహా పెద్దగా ఎవరు రాణించలేదు. భారత బౌలర్లు సమిష్టిగా రాణించడంతో ఇంగ్లాండ్ 17 ఓవర్లుకు 121 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయ్యింది. భువనేశ్వర్ కుమార్ 3, బుమ్రా, చాహల్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా పాండ్యా, హర్షల్ పటేల్ తలో వికెట్ తీశారు. ఈ విజయంతో భారత్ టీ20 సిరీస్ ను 2-0తో కైవసం చేసుకుంది. చివరిదైన మూడో టీ20 ఇవాళ రాత్రి 7గంటలకు ట్రెండ్ బ్రిడ్జ్ లో జరగనుంది.

ఇవి కూడా చదవండి: