Published On:

ICC Women T20 World Cup 2026: విమెన్ టీ20 వరల్డ్ కప్.. వేదికలు ఇవే

ICC Women T20 World Cup 2026: విమెన్ టీ20 వరల్డ్ కప్.. వేదికలు ఇవే

Cricket: వచ్చే ఏడాది ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న విమెన్ టీ20 వరల్డ్ కప్ గ్రౌండ్స్ ను ఐసీసీ ఫైనల్ చేసింది. మొత్తం ఏడు వేదికల్లో ఈ మెగా టోర్నమెంట్ నిర్వహిస్తామని తెలిపింది. అందుకుగాను ఎడ్జ్ బాస్టన్, హాంప్ షైర్ బౌల్, హెడింగ్లీ, ఓల్డ్ ట్రాఫోర్డ్ క్రికెట్ గ్రౌండ్, ది ఓవల్, బ్రిస్టల్ కౌంటీ గ్రౌండ్ లో మ్యాచ్ లు జరగనున్నాయి. ఈ మేరకు ఐసీసీ అఫీషియల్ వెబ్ సైట్ లో వివరాలు అందుబాటులో ఉంచింది. కాగా టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ 2026 జూలై 5న లార్డ్స్ స్టేడియంలో నిర్వహించనుంది.

కాగా ఐసీసీ మహిళా ప్రపంచకప్ 2026 పోటీలు జూన్ 12 ప్రారంభమవుతాయి. కాగా ఈ పోటీకి అతిథ్య ఇంగ్లాండ్ జట్టుతో పాటు ఇండియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌతాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్, పాకిస్తాన్ జట్లు అర్హత సాధించాయి. అయితే వచ్చే ఏడాది జరగనున్న క్వాలిఫయర్ మ్యాచ్ ల ద్వారా మరో నాలుగు టీంలను ఐసీసీ ఎంపిక చేయనుంది. టోర్నీలో మొత్తం 33 మ్యాచ్ లు జరగనున్నాయి. మొత్తం 12 జట్లను రెండు గ్రూపులుగా విభజన చేయనున్నారు. అయితే విమెన్ టీ20 వరల్డ్ కప్ పోటీలు చివరిసారిగా 2024లో జరిగాయి. ఫైనల్ లో న్యూజిలాండ్ జట్టు సౌతాఫ్రికాను ఓడించి ట్రోఫీని గెలుచుకుంది. కానీ టోర్నీ ఏదైనా ఇండియాలో క్రికెట్ కు ఫ్యాన్స్ భారీగానే ఉన్నారు. ఎక్కడ మ్యాచ్ జరిగినా అభిమానులు టీవీలకు అతుక్కుపోతారు. ఈ టోర్నీని ఈసారి తప్పకుండా గెలవాలని టీమిండియా కృషి చేస్తోంది.