Published On:

PBKS Vs LSG: పంజాబ్- లక్నో మధ్య మ్యాచ్.. బౌలింగ్ ఎంచుకున్న లక్నో

PBKS Vs LSG: పంజాబ్- లక్నో మధ్య మ్యాచ్.. బౌలింగ్ ఎంచుకున్న లక్నో

IPL2025: ఐపీఎల్ సీజన్ 2025 లో ఇవాళ పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జైంట్స్ జట్లు తలపడనున్నాయి. ముందుగా టాస్ గెలిచిన లక్నో జట్టు బౌలింగ్ ఎంచుకుంది. అయితే ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే రెండు జట్లకు ఈ మ్యాచ్ ఎంతో కీలకం.. అందుకే గెలుపుకోసం ఇరు జట్లు ఆరాటపడుతున్నాయి.

ఈ సీజన్‌లో పంజాబ్ ఇప్పటివరకు 10 మ్యాచ్‌లు ఆడి 6 మ్యాచ్ ల్లో విజయం సాధించగా.. 13 పాయింట్లతో 4వ స్థానంలో ఉంది. మరోవైపు లక్నో జట్టు ఇప్పటివరకు 10 మ్యాచ్ లు ఆడగా 5 మ్యాచ్ లు గెలిచి 10 పాయింట్లతో 6వ స్థానంలో ఉంది.

లక్నో సూపర్ జెయింట్స్: ఐడెన్ మార్క్రాృమ్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్ (కెప్టెన్), అబ్దుల్ సమద్, ఆయుష్ బడోని, డేవిడ్ మిల్లర్, ఆకాష్ మహరాజ్ సింగ్, దిగ్వేష్ సింగ్ రాఠీ, అవేష్ ఖాన్, మయాంక్ యాదవ్, ప్రిన్స్ యాదవ్

పంజాబ్ కింగ్స్: ప్రియాంష్ ఆర్య, ప్రభ్ సిమ్రాన్ సింగ్, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), జోష్ ఇంగ్లిస్, శశాంక్ సింగ్, నెహాల్ వధేరా, మార్కస్ స్టోయినిస్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మార్కో జాన్సెన్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్ దీప్ సింగ్