Tamim Iqbal: మైదానంలోనే స్టార్ క్రికెటర్‌కు గుండెపోటు.. వెంటిలేటర్‌పై ట్రీట్‌మెంట్.. పరిస్థితి విషమంగానే!

Bangladesh Cricketer Tamim Iqbal admitted to hospital in critical condition: బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్, మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ గుండెపోటుకు గురయ్యారు. ఢాకా ప్రీమియర్ డివిజన్ క్రికెట్ లీగ్ ఆడుతుండగా మైదానంలోనే ఒక్కసారిగా ఇక్బాల్ గుండెపోటుతో కుప్పకూలిపోయారు. దీంతో వెంటనే తోటి క్రీడాకారులతో పాటు సిబ్బంది అప్రమత్తమై ఆయనను ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు ఇక్బాల్‌కు ఈసీజీతో పాటు ఇతర స్కాన్నింగ్స్ చేయించారు. ప్రస్తుతం ఇక్బాల్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, ఇక్బాల్ వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నట్లు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చీఫ్ ఫిజీషియన్ దేబాశీష్ తెలిపారు.
కాగా, ఢాకా ప్రీమియర్ డివిజన్ క్రికెట్ లీగ్ మ్యాచ్‌లో భాగంగా ఇవాళ మహ్మదన్ స్పోర్టింగ్ క్లబ్, షినెపుకర్ క్రికెట్ క్లబ్‌ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. అయితే తమీమ్ ఇక్బాల్.. మహ్మదన్ కల్బ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా… టాస్ కోసమని మైదానంలోకి వచ్చాడు.. ఇంకా కాసేపట్లో మ్యాచ్ జరుగుతుందని అనుకుంటున్న తరుణంగా ఒక్కసారిగా అక్కడే కుప్పకూలాడు. దీంతో వెంటనే ఆయనను అక్కడే ఉన్న ఫజిలాతున్నెసా ఆస్పత్రికి తరలించారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
అయితే, మెరుగైన చికిత్స నిమిత్తం అక్కడినుంచి ఢాకాకు తరలించేందుకు హెలికాప్టర్ ఏర్పాటు చేశారు. ఆయనను హెలిప్యాడ్‌కు వెళ్తున్న సమయంలో మరోసారి ఛాతీలో నొప్పి రావడంతో తిరిగి అదే ఆస్పత్రికి తరలించారు. కాగా, తమీమ్ ఆరోగ్యం పరిస్థితి గురించి బంగ్లాదేశ్ ప్రభుత్వ అధికారి మహ్మద్ యూనస్ ఆరా తీశారు.
ఇక, తమీమ్ ఇక్బాల్ అంతర్జాతీయ క్రికెట్‌కు ఈ ఏడాది జనవరిలో వీడ్కోలు పలికారు. ఆ తర్వాత దేశీయ లీగ్ మ్యాచ్‌లు ఆడుతున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో చివరి మ్యాచ్ 2023లో కెప్టెన్‌గా వ్యవహరించాడు. మొత్తం బంగ్లాదేశ్ తరఫున 70 టెస్టులు, 78 టీ20, 243 వన్డే మ్యాచ్‌లు ఆడాడు. వన్డే మ్యాచ్‌ల్లో 8,357 పరుగులు చేశాడు.