Last Updated:

MLC Elections: తెలంగాణపై కమలదళం కన్నేసిందా? ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు కమలం దూకుడు!

MLC Elections: తెలంగాణపై కమలదళం కన్నేసిందా? ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు కమలం దూకుడు!

BJP Preparing For Upcoming MLC Elections In Telangana: తెలంగాణపై కమలదళం కన్నేసిందా? రాష్ట్రంలో త్వరలో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు కమలం పార్టీ దూకుడుగా ముందుకు వెళ్తుందా? పార్లమెంట్ ఎన్నికల్లో చూపించిన జోష్నే ఎమ్మెల్సీ, పంచాయతీ ఎన్నికల్లో చూపించేందుకు కమలనాథులు రెడీ అవుతున్నారా..? రాష్ట్రంలో జరిగే ఏ ఎన్నిక అయినా…కమలం పార్టీ గెలవాల్సిందే అన్న వ్యూహంతో పార్టీ అడుగులు వేస్తోందా అంటే అవుననే సమాధానం రాజకీయవర్గాల్లో విన్పిస్తోంది. ఇంతకీ ఎమ్మెల్సీ, లోకల్ బాడీ ఎన్నికల్లో బీజేపీ అనుసరించబోతున్న సరికొత్త వ్యూహం ఏంటి..? వాచ్ ది స్టోరీ.

తెలంగాణలో బీజేపీ జెండాను రెపరెపలాడించాలన్న టార్గెట్ తో ఆపార్టీ రాష్ట్రంపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. 2029 ఎన్నికల్లో పార్టీ గెలిచి అధికారంలోకి రావాలంటే ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో పార్టీ బలంగా ఉండాలన్న ఆలోచనతో వేగంగా అడుగులు వేస్తోంది. ఒక్కో అడుగు వేసుకుంటూ వెళ్తే.. 2029 ఎన్నికల్లో విజయం సులభం అవుతుందనేది పార్టీ పెద్దల ఆలోచన. అందుకే అందివచ్చిన ఎటువంటి అవకాశాన్నైనా వదులుకోవద్దనే ఆలోచనతో ఉన్నారు రాష్ట్ర పార్టీ పెద్దలు. తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగబోయే టీచర్, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ నేతలు సరికొత్త వ్యూహాలకు పదునపు పెడుతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ సత్తా చూపిస్తే..అది లోకల్ బాడీ ఎన్నికలపై ప్రభావం చూపిస్తుందనేది నేతల ఆలోచన. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిస్తే పంచాయతీ ఎన్నికల్లో గెలుపు ఈజీ అవుతుందని..తద్వారా రాష్ట్రంలో పార్టీ బలోపేతం అవుతుందని పార్టీ హైకమాండ్ నేతలు ఆలోచిస్తున్నారు. అందుకే త్వరలో జరిగే ఎమ్మెల్సీ, పంచాయతీ ఎన్నికల్లో వందకు వందశాతం గెలవాల్సిందే అన్న టార్గెట్ తో నేతలు రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో 2029లో అధికారంలోకి రావాలంటే..స్థానికంగా పార్టీ బలోపేతం కావాలి. అది జరగాలంటే త్వరలో జరగబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరాల్సిందే. త్వరలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ సత్తా చాటితే..పంచాయతీ, జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో సులభంగా ఢీకొట్టవచ్చనే అభిప్రాయాన్ని పార్టీ నేతలు వ్యక్తపరుస్తున్నారు. అందుకే గెలుపే లక్ష్యంగా కాషాయ దళం ముందుకు వెళ్తూ సరికొత్త వ్యూహాలకు పదును పెడుతున్నారు. రాష్ట్రంలో కాషాయ జెండా ఎగరవేయాలి అంటే గ్రౌండ్ లెవెల్ లో పార్టీని బలోపేతం చేయాలని అధిష్టానం రాష్ట్ర నాయకత్వానికి ఆదేశాలు జారీ చేసింది. పార్లమెంట్ ఎన్నికల్లో చూపించిన జోష్నే త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ, స్థానిక సంస్థలు, GHMC ఎన్నికల్లో కూడా కొనసాగించాలని బీజేపీ శ్రేణులకు రాష్ట్ర నాయకత్వం దిశానిర్ధేశం చేసిందట. దానిలో భాగంగానే త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా తెలంగాణ బీజేపీ ముందుకు దూసుకెళ్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందే ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చే అవకాశం ఉండడంతో..మూడు ఎమ్మెల్సీ ఎన్నికలకు అభ్యర్థులను ఇప్పటికే బీజేపీ అధిష్టానం ప్రకటించి సమరంలో అందరికంటే ముందు వరుసలో నిలిచింది.

తెలంగాణలో త్వరలో రెండు టీచర్, ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఆయా స్థానాల్లో పోటీచేసేందుకు అందరికంటే ముందే బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. నల్గొండ-ఖమ్మం-వరంగల్‌ టీచర్‌ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సరోత్తంరెడ్డి…కరీంనగర్-మెదక్‌-ఆదిలాబాద్‌-నిజామాబాద్‌ టీచర్‌ ఎంఎల్సీ అభ్యర్థిగా మల్కా కొమరయ్య…కరీంనగర్-మెదక్‌-ఆదిలాబాద్‌-నిజామాబాద్‌ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అంజిరెడ్డి పేర్లను బీజేపీ అధిష్ఠానం ప్రకటించింది. పార్లమెంట్ ఎన్నికల్లో 8 ఎంపీ స్థానాలని గెలిచి సత్తా చాటిన బీజేపీ..అదే ఊపులో త్వరలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగే ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా వ్యూహాలకు పదును పెడుతూ ముందుకు వెళుతుంది. ఇందులో భాగంగా అందరికన్నా ముందుగా అభ్యర్థులను కూడా ప్రకటించి ఎమ్మెల్సీ రేసులో దూసుకుపోతోంది.

మూడింటికి మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో అభ్యర్థులను గెలిపించి తెలంగాణలో కమలం పార్టీకి తిరుగులేదని నిరూపించాలని పార్టీ అధిష్టానం భావిస్తోంది. మూడు ఎమ్మెల్సీ స్థానాలను గెలిచి..ఆ తర్వాత జరిగే పంచాయతీ ఎన్నికలు, జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో కూడా సత్తా చాటాలని..అందుకే క్షేత్రస్థాయిలో నేతలు ఇంటింటికి తిరిగాల్సిందే అంటూ పార్టీ హైకమాండ్ దిశానిర్థేశం చేసిందట. గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లో పార్టీని మరింత బలోపేతం చేయాలని…అందుకే త్వరలో జరగబోయే ఎమ్మెల్సీ, పంచాయతీ ఎన్నికలే మంచి అవకాశమని..ఇటువంటి అవకాశాన్ని చేజార్చుకోవద్దని నేతలకు సూచించారు. ప్రతీ కార్యకర్త, ప్రతీ ఎమ్మెల్యే, పార్టీ సీనియర్ నేతలు అందరూ కలిసి సమన్వయంతో ముందుకు వెళ్లి పార్టీ విజయానికి క్రుషి చేయాలన్నారు. అటు కేంద్రంలో బీజేపీ సర్కార్ ఉందని…ఇటు తెలంగాణ రాష్ట్రంలోనే బీజేపీ అధికారం దక్కితే డబుల్ ఇంజిన్ సర్కారుతో అభివ్రద్ది పరుగులు తీయడం గ్యారెంటీ అని కమలం నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మూడు ఎమ్మెల్సీ స్థానాలతో పాటు ప్రతీ పంచాయతీని కైవసం చేసుకోవాల్సిందే అంటూ నేతలకు పార్టీ హైకమాండ్ నేతలు దిశానిర్ధేశం చేశారు.

కరీంనగర్-మెదక్‌-ఆదిలాబాద్‌-నిజామాబాద్..ఈ ఉమ్మడి జిల్లాలో బీజేపీకి నలుగురు ఎంపీలు, ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ బలం తమకు కలిసి వస్తుందని బీజేపీ భావిస్తుంది. దీంతో పాటు నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి జరగనున్న ఎన్నికల్లో కూడా సత్తా చాటాలని పార్టీ అధిష్టానం భావిస్తోంది. అభ్యర్థులను ప్రకటించమే ఆలస్యం..వారంతా అప్పుడే ప్రచారంలో మునిగి తేలుతున్నారు. తమని గెలిపిస్తే..రాబోయే రోజుల్లో ఏం చేస్తామో అనే అంశాలను వివరిస్తూ ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు కాషాయ పార్టీ అభ్యర్థులు. కేంద్రంలో బీజేపీ సర్కార్ ఉందని..రాష్ట్రంలో కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలంటే కమలం పార్టీనే గెలిపించాలని అభ్యర్థులు కోరుతున్నారు. బీజేపీతోనే దేశం డెవలప్ అవుతుందని..కాంగ్రెస్ తో అది సాధ్యంకాదని నేతలు వివరిస్తున్నారు. శాసనమండలిలోకి అడుగుపెట్టేందుకు తమను గెలిపిస్తే నియోజకవర్గ జిల్లాలను మరింత డెవలప్ చేస్తామని హామీల వర్షం కురిపిస్తున్నారు. రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ కు, విపక్ష బీఆర్ఎస్ చెక్ పెట్టేలా ప్రజలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీర్పు ఇవ్వాలని కోరుతున్నారు. ఇదే తీర్పు రేపు జరగబోయే పంచాయతీ, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో చూపించాలని కోరుతున్నారు.

మొత్తానికి కాషాయ దళం..తెలంగాణలో పాగా వేసేందుకు సరికొత్త వ్యూహ రచనతో ముందుకువెళ్తోంది. రేపు జరిగే టీచర్, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కమలం పార్టీదే విజయం అనేలా సరికొత్త వ్యూహాలకు పదును పెడుతున్నారు. అందులో భాగంగానే అందరికంటే ముందు ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించి ప్రచారాన్ని సైతం ప్రారంభించింది. మరి మూడు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగే ఎన్నికల్లో పార్టీ సత్తా చాటుతుందా లేదా తెలియాలంటే ఎన్నికల వరకు వేచి చూడాల్సింది.