Last Updated:

Allu Arjun: ఏపీ హైకోర్టులో అల్లు అర్జున్‌కు భారీ ఊరట – ఆ కేసు కొట్టేసిన న్యాయస్థానం

Allu Arjun: ఏపీ హైకోర్టులో అల్లు అర్జున్‌కు భారీ ఊరట – ఆ కేసు కొట్టేసిన న్యాయస్థానం

High Court Dismisses Allu Arjun Case: ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌కి హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల సమయంలో నంద్యాలలో పర్యటించిన అల్లు అర్జున్‌పై కేసు నమోదైన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసును న్యాయస్థానం కొట్టివేసింది. ఎన్నిలక నియమావళిని బన్నీ ఉల్లంఘించారనే కారణంతో నంద్యాల పోలీసులు అల్లు అర్జున్‌పై కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసును కొట్టివేయాలని అల్లు అర్జున్‌, మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రరెడ్డి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

ఈ నేపథ్యంలో గత నెల 25న ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా నవంబర్‌ 6 వరకు వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశిచింది. అలాగే నవంబర్‌ 6న ఈ కేసుపై తుది తీర్పు ఇవ్వనున్నట్టు ధర్మాసనం స్పష్టం చేసింంది. ఈ నేపథ్యంలో బుధవారం ఈ కేసుపై విచారణ జరిపిన ధర్మాసనం.. కేసును కొట్టివేస్తూ తీర్పు వెలువరిచింది. దీంతో అల్లు అర్జున్‌కు నంద్యాల కేసులో భారీ ఊరట లభించింది. కాగా ఏపీ ఎన్నికల సమయంలో అల్లు అర్జున్‌ తన స్నేహితుడు, వైఎస్సార్‌సీపీ అభ్యర్థి శిల్పా రవింద్రారెడ్డి విజయాన్ని ఆకాంక్షిస్తూ నంద్యాలలోని ఆయన ఇంటికి వెళ్లారు.

దీంతో అల్లు అర్జున్‌ను చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. అయితే ముందస్తు అనుమతి లేకుండ బన్నీ ర్యాలీ నిర్వహించి 144 సెక్షన్‌ ఉల్లంఘించారనే నేపథ్యంలో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. అనుమతి లేకుండా నంద్యాలలో అల్లు అర్జున్, శిల్పా రవి ర్యాలీ నిర్వహించారంటూ పోలీసులకు రిటర్నింగ్ అధికారి ఫిర్యాదు చేయడంతో ఆర్వో ఆధారంగా పోలీసులు వారిపై ఐపీసీ సెక్షన్ 188 కింద ఈ కేసు నమోదు చేశారు. దీంతో తనపై ఉన్న కేసును కొట్టివేయాలంటూ అల్లు అర్జున్‌, శిల్పా రవిలు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన ఏపీ హైకోర్టు ఈ కేసును కొట్టివేసింది.

ఇవి కూడా చదవండి: