Home / high court
Vijay Devarakonda: గిరిజనులను కించ పరిచేలా, ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేశారనే కేసులో విజయ్ దేవరకొండ పిటిషన్ పై తీర్పును తెలంగాణ హైకోర్టు వాయిదా వేసింది. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని విజయ్ దేవరకొండ హైకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇవాళ వాదనలు పూర్తయ్యాయి. విజయ్ దేవరకొండ సామాజిక మాధ్యమాల్లో క్షమాపణ చెప్పారని ఆయన తరపు న్యాయవాది వాదనల సందర్భంగా హైకోర్టుకు తెలిపారు. అయితే సోషల్ మీడియాలో చెప్పిన క్షమాపణలు పరిగణలోకి తీసుకోకూడదని […]
High Court On Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు నిర్వహించాలని సూచించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం 30 రోజుల గడువు కోరగా, రాష్ట్ర ఎన్నికల సంఘం 60 రోజుల గడువు కోరింది. దీంతో 30 రోజుల్లో వార్డు విభజన చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తాజాగా జారీ చేసిన కోర్టు ఆదేశాలతో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు, వార్డు డివిజన్ […]
AP High Court Holiday from Today: ఏపీ హైకోర్టుకు వేసవి సెలవులు ప్రకటించారు. ఈ సెలవులు నేటి నుంచి జూన్ 13 వరకు ఉండనున్నట్లు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. మళ్లీ జూన్ 16 నుంచి హైకోర్టు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుందని, అప్పటినుంచే అన్ని కార్యకలాపాలు ప్రారంభమవుతాయని పేర్కొంది. అయితే ఈ వేసవి సెలవుల్లో హైకోర్టు పలు కీలక అంశాలను ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ వేసవి సెలవుల్లో అత్యవసర వ్యాజ్యాలకు సంబంధించిన కేసుల విచారణకు […]
Telangana high court Justice Girija Priyadarsini Passed Away: తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గిరిజా ప్రియదర్శిని కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంగా బాధపడుతున్న ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కాసేపటి క్రితం మరణించారు. విశాఖపట్నంలో జన్మించిన జస్టిస్ గిరిజా ప్రియదర్శిని ఎన్బీఎమ్ లా కళాశాలలో న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. అలాగే లేబర్ అండ్ ఇండస్ట్రీలా లో మాస్టర్స్ చదివిన ఆమె మూడు విభాగాల్లో పీజీ పూర్తి చేశారు. […]
Group-1: గ్రూప్- 1 పరీక్ష వివాదంపై ఇవాళ తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. విచారణలో భాగంగా ధర్మాసనం కమిషన్ ను పలు అంశాలపై ప్రశ్నించింది. దేశంలోని పలు రాష్ట్రాల్లో మృతభాషకు ప్రాధ్యాన్యత ఇస్తుంటే.. మరి తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఇంగ్లీష్ మాట్లాడే వారికే ఎందుకు ఇస్తున్నారని కోర్టు అడిగింది. తెలుగు పరీక్ష రాసిన వారికి మార్కులు తక్కువగా వచ్చాయని అభ్యర్థులు ఆరోపిస్తున్నారని.. దీనిపై కమిషన్ తగిన కారణాలను చెప్పాలని […]
Telangana High Court : భూదాన్ భూములకు సంబంధించిన వ్యవహారంపై పలువురు ఐపీఎస్ అధికారులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యవహారంపై ఈ నెల 24న న్యాయస్థానం విచారణ చేపట్టింది. మొత్తం 27 మంది అధికారులకు సంబంధించిన భూములను నిషేధిత జాబితాలో పెట్టాలని ఆదేశించింది. జస్టిస్ భాస్కర్రెడ్డి సింగిల్ బెంచ్ ధర్మాసనం తీర్పు వెలువరించింది. తీర్పును సవాల్ చేస్తూ మంగళవారం కొందరు ఐపీఎస్ అధికారులు హైకోర్టును ఆశ్రయించారు. కోర్టును ఆశ్రయించిన వారిలో మహేశ్భగవత్, స్వాతి లక్రా, సౌమ్యా మిశ్రా […]
Telangana High Court : 2024 లోక్సభ ఎన్నికల్లో రేవంత్రెడ్డి బీజేపీపై తీవ్ర ఆరోపణలు చేశారు. కమలం పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు ఎత్తివేస్తుందని వ్యాఖ్యానించాడు. బీజేపీపై చేసిన వ్యాఖ్యలపై నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో కేసు నమోదైంది. కేసును కొట్టేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ధర్మాసనంలో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్లో తుదితీర్పు వెలువడే వరకు నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు ఎదుట హాజరు నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలని […]
High Court : తెలుగు రాష్ట్రాల హైకోర్టు న్యాయమూర్తుల బదిలీ జరిగాయి. 7గురు హైకోర్టు న్యాయమూర్తులను బదిలీలు జరిగాయి. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. న్యాయమూర్తులను బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయం తీసుకుంది. కర్ణాటక హైకోర్టుకు చెందిన 4గురు న్యాయమూర్తులు ఉన్నారు. తెలంగాణ హైకోర్టుకు చెందిన ఇద్దరు న్యాయమూర్తులు ఉన్నారు. ఏపీకి చెందిన న్యాయమూర్తి ఒకరు ఉన్నారు. ఈ మేరకు సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని కొలీజియం ఆమోదం […]
Hyderabad Metro : నగరంలోని పాతబస్తీలో మెట్రో రైలు నిర్మాణ పనులపై తెలంగాణ హైకోర్టులో దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై గురువారం విచారణ జరిగింది. యాక్ట్ ఫర్ పబ్లిక్ వెల్ఫేర్ ఫౌండేషన్ వేసి పిటిషన్పై ఉన్నత న్యాయస్థానం విచారణ జరిపింది. మెట్రో నిర్మాణం వల్ల చారిత్రక కట్టడాలు దెబ్బతింటున్నాయని ఫౌండషన్ తన పిటిషన్లో పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏఏజీ వాదనలు వినిపించారు. పురావస్తుశాఖ గుర్తించిన చారిత్రక కట్టడాలను నష్టం లేకుండా చూస్తున్నామని ఈ సందర్భంగా ఏఏజీ కోర్టుకు […]
Sensational Verdict on Dilsukhnagar Bomb Blast Case: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైదరాబాద్లోని దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసులో తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. నిందితులు వేసిన పిటిషన్ను కోర్టు డిస్మిస్ చేసింది. ఇందులో 5 మంది నిందితులకు ఉరిశిక్ష విధిస్తూ తీర్పును వెల్లడించింది. ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును ధర్మాసనం సమర్థించింది. 5 మంది నిందితులకు జస్టిస్ లక్ష్మణ్, జస్టిస్ శ్రీసుధతో కూడిన ధర్మాసనం ఉరిశిక్షను ఖరారు చేసింది. 45 రోజులపాటు హైకోర్టు […]