Published On:

Pakistan : పాక్‌కు గట్టి షాక్.. ఉగ్ర సంస్థలకు నిధులు, ఉగ్రవాదులకు శిక్షణ నిజమే : అంగీకరించిన పాక్‌ రక్షణమంత్రి

Pakistan : పాక్‌కు గట్టి షాక్.. ఉగ్ర సంస్థలకు నిధులు, ఉగ్రవాదులకు శిక్షణ నిజమే : అంగీకరించిన పాక్‌ రక్షణమంత్రి

Pakistan : పాకిస్థాన్‌కు గట్టి షాక్ తగిలింది. తమ గడ్డపై ఉగ్రవాదులు లేరంటూ ప్రగల్భాలు పలికింది. ఉగ్ర సంస్థలకు నిధులు, ఉగ్రవాదులకు శిక్షణ నిజమేనంటూ స్వయంగా పాక్ రక్షణమంత్రి అంగీకరించారు. ఓ అంతర్జాతీయ మీడియాకు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో ఖవాజా ఆసిఫ్‌ చేసిన వ్యాఖ్యలు పాకిస్థాన్ నీచ బుద్ధిని బయటపెట్టాయి. అమెరికా కోసమే తాము ఉగ్రవాదులను పెంచి పోషించామంటూ మంత్రి వ్యాఖ్యానించడం గమనార్హం.

 

పహల్గాం దాడి తర్వాత ఇండియాలో నెలకొన్న ఉద్రిక్తతలపై పాకిస్థాన్ రక్షణమంత్రి ఖవాజా ఆసిఫ్‌ ‘స్కై న్యూస్‌’ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ‘ఉగ్ర సంస్థలకు నిధుల సమీకరణ, ఉగ్రవాదులకు శిక్షణ, మద్దతు వంటివి పాకిస్థాన్ చాలాకాలంగా చేస్తోంది? దీన్నిపై మీ స్పందన ఏంటి?’ అని జర్నలిస్టు ప్రశ్నించారు. దీనికి మంత్రి ఖవాజా బదులిచ్చారు. ‘అమెరికా, బ్రిటన్‌‌పాటు పశ్చిమదేశాల కోసం 3 దశాబ్దాల పాటు తాము చెత్త పనులన్నీ చేస్తున్నామని చెప్పుకొచ్చారు. అయితే అది పొరబాటు అని అర్థమైందని వివరించారు. దానివల్ల పాకిస్థాన్ చాలా ఇబ్బందులు పడిందన్నారు. సోవియట్‌ యూనియన్‌కు వ్యతిరేకంగా జరిగిన యుద్ధంలో తాము చేరకపోయి ఉంటే, పాకిస్థాన్‌కు తిరుగులేని ట్రాక్‌ రికార్డు ఉండేదని అన్నారు. ఇదే ఇంటర్వ్యూలో లష్కరే తోయిబా గురించి కూడా ప్రస్తావించారు. అది పాత పేరు అని, ఇప్పుడు తమ దేశంలో దాని ఉనికిలేదని స్పష్టం చేశారు.

 

నియంత్రణ రేఖకు పాకిస్థాన్ సైనికులు..
మరోవైపు ఉద్రిక్తతల నేపథ్యంలో సరిహద్దుల్లో పాకిస్థాన్ తన బలగాలను పెంచుతున్నట్లు తెలుస్తోంది. అఫ్గానిస్థాన్‌ సరిహద్దులతోపాటు బలోచిస్థాన్‌లో ఉన్న మిలిటరీ సిబ్బందిని నియంత్రణ రేఖ వద్దకు పంపిస్తున్నట్లు కథనాలు వెలువడుతున్నట్లు సమాచారం. జవాన్ల సెలవులను కూడా పాకిస్థాక్‌ మిలిటరీ రద్దు చేసినట్లు తెలుస్తోంది. కొత్త సెలవులను ఆమోదించొద్దని కార్ప్స్‌ కమాండర్లను ఆదేశించినట్లు ఆ కథనాలు పేర్కొన్నాయి.

 

పహల్గాంలోని బైసరన్‌ లోయలో ఈ నెల 22వ తేదీన పర్యాటకులపై ఉగ్రవాదులు దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. దాడిలో 26 మంది దుర్మరణం చెందారు. పహల్గాంలో దాడి వెనుక ‘ది రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌’ హస్తం ఉందని భద్రతా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఇది పాకిస్థాన్ కేంద్రంగా ఉన్న లష్కరే తోయిబాకు అనుబంధ సంస్థ. దీనిని కేంద్ర ప్రభుత్వం గతంలోనే ఉగ్ర సంస్థగా ప్రకటించింది.

 

 

ఇవి కూడా చదవండి: