Published On:

Mohamed Mujiju : 15 గంటలు ప్రెస్‌ కాన్ఫరెన్స్‌.. మాల్దీవుల అధ్యక్షుడి రికార్డు

Mohamed Mujiju : 15 గంటలు ప్రెస్‌ కాన్ఫరెన్స్‌.. మాల్దీవుల అధ్యక్షుడి రికార్డు

Maldives President Mohamed Mujiju Record : మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్‌ ముయిజ్జు ప్రపంచ రికార్డు నెలకొల్పారు. దాదాపు 15 గంటల పాటు విలేకరుల సమావేశంలోని పాల్గొని ఆ ఘనత సాధించిన ప్రపంచంలోని మొదటి అధ్యక్షుడిగా నిలిచారు. శనివారం ఉదయం 10 గంటలకు ఆయన మారథాన్ విలేకరుల సమావేశం నిర్వహించారని అధికారులు తెలిపారు.

 

14 గంటల 54 నిమిషాలపాటు ప్రసంగం..
విలేకరుల సమావేశం మధ్యలో ప్రార్థనల కోసం విరామం ఇచ్చారు. అనంతరం 14 గంటల 54 నిమిషాలు మాట్లాడారని మాల్దీవుల అధ్యక్ష కార్యాలయం అధికారులు తెలిపారు. సుదీర్ఘ సమావేశంలో విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. శనివారం ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం సందర్భంగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. మారథాన్‌ విలేకరుల సమావేశంలో ఇప్పటి వరకు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ పేరిట ఉన్న రికార్డును ముయిజ్జు అధిగమించినట్లు మాల్దీవుల అధ్యక్ష కార్యాలయం తెలిపింది.

 

ఉక్రెయిన్‌ అధ్యక్షుడు 14 గంటలపాటు ప్రసంగం..
2019 అక్టోబర్‌లో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ 14 గంటలపాటు విలేకరుల సమావేశం నిర్వహించి రికార్డు నెలకొల్పారు. 2009లో మాల్దీవుల అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించిన మొహమ్మద్ నషీద్ హిందూ మహాసముద్రం అడుగున కేబినెట్ సమావేశం నిర్వహించి ప్రపంచ రికార్డు నెలకొల్పారు. గ్లోబల్‌ వార్మింగ్‌ మూలంగా సముద్ర మట్టాలు పెరగడంతో దిగువస్థాయిలో ఉన్న తమ దేశం మునిగిపోయే ప్రమాదం ఉందని ప్రపంచ దేశాలకు చాటి చెప్పడానికి అప్పట్లో ఆయన వినూత్న నిరసన తెలిపారు.

 

 

ఇవి కూడా చదవండి: