ICC Rankings: ఐసీసీ ర్యాంకింగ్స్ రిలీజ్.. వన్డే, టీ 20ల్లో భారత్ హవా

Cricket: ఐసీసీ ర్యాంకింగ్స్ లో భారత్ జోరు కొనసాగిస్తోంది. తాజాగా విడుదలైన ర్యాంకింగ్స్ ప్రకారం వన్డే, టీ20 ల్లో ఇండియా నెంబర్ వన్ ప్లేస్ లో కొనసాగుతోంది. మరోవైపు టెస్టుల్లో మాత్రం నాలుగో స్థానానికి పడిపోయింది. టెస్టుల్లో ఆస్ట్రేలియా టాప్ లో కొనసాగుతోంది. రెండు, మూడవ స్థానంలో ఇంగ్లాండ్, సౌతాఫ్రికా ఉన్నాయి.
అయితే వన్డేల్లో ఇండియా 124 పాయింట్లతో మొదటి స్థానంలో నిలిచింది. భారత్ తర్వాత న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్లు కొనసాగుతున్నాయి. ఇక వన్డే ఫార్మట్ లో శ్రీలంక, పాకిస్తాన్ ఒకే స్థానంలో నిలిచాయి. తర్వాత సౌతాఫ్రికా, ఆప్ఘనిస్తాన్, ఇంగ్లాండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్ ఉన్నాయి. వన్డే ఫార్మట్ లో టీమిండియా నిలకడగా రాణిస్తోంది. తాజాగా జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని సాధించడమే ఇందుకు నిదర్శనంగా కనిపిస్తోంది.
మరోవైపు టీ20 ఫార్మట్ లోనూ టీమిండియా 271 పాయింట్లతో ఫస్ట్ ర్యాంక్ సొంతం చేసుకుంది. కొంతకాలంగా టీమిండియా టీ20 ల్లో అద్బుతంగా రాణిస్తోంది. 2024లో జరిగిన టీ20 వరల్డ్ కప్ సిరీస్ ను గెలుచుకుంది. ఈ ఫార్మట్ లో ఇండియా తర్వాత ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, వెస్టిండీస్, సౌతాఫ్రికా, శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆప్ఘనిస్తాన్ జట్లు టాప్ 10 లో నిలిచాయి.
వన్డే, టీ20 ఫార్మట్ లో అద్బుతంగా రాణిస్తున్న టీమిండియా టెస్టుల్లో మాత్రం వెనుకబడిపోతోంది. ఇందుకు నిదర్శనం.. న్యూజిలాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో 3-0 తో ఘోరంగా ఓడిపోయింది. అలాగే ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోనూ భారత్ 1-3 తేడాతో ఓటమి చవిచూసింది. ఇకనైనా ప్లేయర్లు ఆ ఫార్మట్ లోనూ అద్బుతంగా రాణిస్తే అన్ని ఫార్మట్ లలో టాప్ ప్లేస్ లో ఉండే అవకాశం ఉంది.