Home / International
భారీ వర్షాలతో పాకిస్తాన్ వణుకుతోంది. ఎడతెరిపిలెకుండా కురుస్తున్న వానలకు నెల రోజుల్లో 148 మంది మృత్యువాతపడినట్లు పాకిస్థాన్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ప్రకటించింది. అకాల వర్షాల కారణంగా ఇళ్లు, రోడ్లు వంతెనలు కొట్టుకొని పోయాయని.. దేశ వ్యాప్తంగా విద్యుత్ అంతరాయం ఏర్పడిందని పాక్ అధికారులు తెలిపారు.
వారు నలుగురు అన్నదమ్ములు. కలసికట్టుగా ఉంటారు. రాజకీయాల్లో రాణిస్తుంటారు. అలా అని ప్రజలకు ఎలాంటి సాయం చేయరు. తమ కుటుంబ ఆస్తులను పెంచుకునేందుకు నిత్యం ప్రయత్నిస్తుంటారు. చివరకు తమను నమ్ముకున్న దేశ ప్రజలకు కనీసం అన్నం కూడా పెట్టలేదు. ఆకలిమంటల్లో అల్లాడుతున్న ప్రజలు తిరుగుబాటు చేయడంతో పలాయనం చిత్తగించారు.
ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు ఎలన్ మస్క్ ట్విట్టర్ తో డీల్‌ను రద్దు చేసుకున్నారు. సోషల్ మీడియా కంపెనీ ట్విట్టర్‌ను 44 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేస్తామని ప్రకటించి ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనమే సృష్టించారు. దీనికి ఆయన చెబుతున్న కారణం ట్విటర్ విలీనం ఒప్పందంలోని పలు నిబంధనలు ఉల్లంఘించిందని ఆరోపిస్తూ డీల్‌ను రద్దు చేసుకుంటున్నట్లు తన చర్యను సమర్థించుకున్నారు.