Published On:

Israel- Hamas War: గాజాలో ఇజ్రాయెల్ దాడులు.. 48 మంది మృతి

Israel- Hamas War: గాజాలో ఇజ్రాయెల్ దాడులు.. 48 మంది మృతి

Israel attack on Gaza: ఇజ్రాయెల్- హమాస్ మధ్య కొంతకాలంగా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్ వాసులను చంపినందుకు ప్రతీకారంగా హమాస్ ఉగ్రవాదులపై ఇజ్రాయెల్ దాడులు జరుపుతూనే ఉంది. కాగా దాడుల్లో చాలమంది ఉగ్రవాదులు, పౌరులు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నిన్న రాత్రి కూడా గాజాపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 48 మంది చనిపోయినట్టు సమాచారం. అందులో 22 మంది చిన్నారులు ఉన్నట్టు జబాలియాలోని ఆరోగ్యశాఖ తెలిపింది.

కాగా ఇజ్రాయెల్- హమాస్ దాడులపై అమెరికా జోక్యం చేసింది. ఇరు వర్గాల మధ్య మధ్యవర్తిత్వం చేసి ఒప్పందం జరిగింది. అయితే యూఎస్ అధినేత డొనాల్డ్ ట్రంప్ సౌదీ పర్యటనలో ఉన్న టైంలోనే గాజాపై ఇజ్రాయెల్ దాడులు చేయడం విశేషం. తాజా దాడులపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమన్ నెతన్యాహు మాట్లాడారు. గాజాపై ఇజ్రాయెల్ దాడులను ఆపమని చెప్పారు. అయితే హూతీ రెబల్స్ ఇజ్రాయెల్ పై దాడులు చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హూతీ దాడులకు కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామన్నారు. అందుకే దాడులు చేస్తున్నామని తెలిపారు.