Published On:

India: టర్కీ, చైనాపై భారత్ యాక్షన్.. మీడియా అకౌంట్స్ బ్లాక్

India: టర్కీ, చైనాపై భారత్ యాక్షన్.. మీడియా అకౌంట్స్ బ్లాక్

Turkey, China X accounts Blocked: గత కొద్దిరోజులుగా భారత్- పాక్ మధ్య ఉద్రిక్తతలు పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. పహల్గామ్ లో పాక్ ప్రేరేపిత జైషే మహ్మద్ ఉగ్రవాదులు 26 మంది పర్యాటలకులను పొట్టనబెట్టుకున్నారు. దీంతో దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఉగ్రవాదులపై చర్యలు తీసుకోవాలని పలు దేశాలు అభిప్రాయపడ్డాయి. అందులో భాగంగానే ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత్ పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని 9 ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసింది. వాటిని సమూలంగా నేలమట్టం చేసింది. దాడుల్లో లష్కరే తోయిబా, జైషే మహ్మద్ కు చెందిన 100 మందికిపైగా ఉగ్రవాదులు హతమయ్యారు. ఇక భారత్ జరిపిన దాడులకు ప్రతీకారంగా పాకిస్తాన్ డ్రోన్లు, మిస్సైళ్ల దాడులు జరిపింది. అలాగే సరిహద్దు వెంబడి కాల్పులకు తెగబడింది. అయితే భారత ఆర్మీ వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టింది. చివరకి భారత్ ముందు నిలవలేక కాల్పుల విరమణ పేరుతో పాకిస్తాన్ కాళ్లబేరానికి వచ్చింది.

 

అయితే ఆపరేషన్ సిందూర్ పై పాక్ చేస్తున్న దుష్ప్రచారానికి టర్కీ, చైనా సపోర్ట్ చేస్తున్నాయి. అందుకు సంబంధించి టర్కీ, చైనా మీడియా, ఎక్స్ అకౌంట్లలో ఫేక్ ప్రచారం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయా మీడియా సంస్థలు, ఎక్స్ అకౌంట్లపై ఇండియా చర్యలు తీసుకుంది. అందులో భాగంగా చైనా, టర్కీకి చెందిన మీడియా, ఎక్స్ అకౌంట్లను భారత్ బ్లాక్ చేసింది. అందులో టర్కీకి చెందిన పబ్లిక్ బ్రాడ్ కాస్టర్ టీఆర్టీ వరల్డ్ ఎక్స్ అకౌంట్ ను ఇవాళ బ్లాక్ చేసింది. అయితే ఇండియా, పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో టర్కీ పాకిస్తాన్ కు అండగా నిలిచింది. టర్కీ నుంచి పాక్ కు డ్రోన్లు సప్లై చేసింది. మరోవైపు చైనా నుంచి కొనుగోలు చేసిన మిస్సైళ్లను పాక్ భారత్ పైకి ప్రయోగించింది. కానీ వాటన్నింటిని ఇండియన్ ఆర్మీ ధీటుగా ఎదుర్కొంది.

 

అయితే పహల్గామ్ వద్ద 26 మంది పర్యాటకులను ఉగ్రవాదులు చంపితే మాట్లాడని టర్కీ, చైనా.. పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు జరిపితే మాత్రం పాకిస్తాన్ కు వంతపాడాయి. ఇండియాకు వ్యతిరేకంగా పనిచేశాయి. అందుకే టర్కీ, చైనాపై భారత్ చర్యలు చేపట్టింది. ఇప్పటికే కొన్ని చైనా మీడియా అకౌంట్లను భారత్ నిషేధించింది. కాగా టర్కీ చేసిన మోసానికి దేశవ్యాప్తంగా ‘బాయ్ కాట్ టర్కీ’ అనే నినాదం ఎక్స్ లో ట్రెండింగ్ లో ఉంది.

 

Image