Home / Gaza Strip
గాజా స్ట్రిప్‌లో ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో సుమారుగా 60 మంది మరణించినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. నిరాశ్రయులకు షెల్టర్ జోన్ గా ఉన్న పాఠశాల, మరొక ప్రాంతంపై ఈ దాడులు జరిగాయి. కాగా, దాదాపు 10 నెలలుగా కొనసాగుతున్న వివాదంలో కాల్పుల విరమణ చర్చలు మరోసారి నిలిచిపోయినట్లు తెలుస్తోంది.
హమాస్ మిలిటరీ చీఫ్ మహమ్మద్ డెయిఫ్ లక్ష్యంగా జరిగిన ఇజ్రాయెల్ వైమానిక దాడిలో దక్షిణ గాజాలో శనివారం కనీసం 71 మంది పాలస్తీనియన్లు మరణించారని ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.ఖాన్ యూనిస్ సమీపంలోని భవనంలో డీఫ్ దాక్కున్నట్లు వచ్చిన నివేదికల తర్వాత డెయిఫ్ మరణించాడా లేదా అన్నది అస్పష్టంగా ఉందని భద్రతా అధికారి ఒకరు తెలిపారు.
గాజా స్ట్రిప్‌లో ఇజ్రాయెల్ దాడుల్లో గత 24 గంటల్లో 240 మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారని హమాస్ ఆధ్వర్యంలోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ( ఐడీఎఫ్ ) సెంట్రల్ గాజాలో త మంగళవారం 100 ప్రాంతాలపై దాడి చేసినట్లు తెలిపింది.
ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ( ఐడీఎఫ్ ) ఉత్తర గాజాలోని షెజాయా పరిసరాల్లో జరిగిన పోరాటంలో ముగ్గురు ఇజ్రాయెలీ బందీలపై పొరపాటున కాల్పులు జరిపినట్లు సైనిక ప్రతినిధి డేనియల్ హగారి శుక్రవారం తెలిపారు.షెజాయాలో జరిగిన పోరాటంలో ఐడీఎఫ్ పొరపాటున 3 ఇజ్రాయెలీ బందీలను శత్రువులుగా గుర్తించి కాల్పులు జరపడంతో బందీలు మరణించారు.
గాజా స్ట్రిప్‌లో యాంటీ ట్యాంక్ క్షిపణి కార్యకలాపాలకు బాధ్యత వహించిన సీనియర్ హమాస్ కమాండర్‌ను తొలగించినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ( ఐడిఎఫ్ ) గురువారం ప్రకటించింది.సెంట్రల్ క్యాంప్స్ బ్రిగేడ్ అని పిలవబడే హమాస్ యొక్క యాంటీ-ట్యాంక్ క్షిపణి శ్రేణికి అధిపతి ఇబ్రహీం అబు-మగ్సిబ్ను సైన్యం తొలగించిందని ఐడిఎఫ్ తెలిపింది.
హమాస్ నెట్‌వర్క్‌ను భూస్థాపితం చేయడమే లక్ష్యంగా గాజా స్ర్టిప్ పై ఇజ్రాయెల్ సాగిస్తున్న భీకర పోరులో కీలక పరిణామం చోటుచేసుకుంది. గాజాను నలువైపులా చుట్టుముట్టిన ఇజ్రాయెల్ దళాలు.. ఈ నగరాన్ని రెండుగా విభజించినట్లు ప్రకటించాయి.
విదేశీ పాస్‌పోర్ట్ హోల్డర్ల మొదటి బృందం బుధవారం యుద్ధంలో దెబ్బతిన్న గాజా స్ట్రిప్ నుండి ఈజిప్ట్‌కు బయలుదేరింది. ఈ తరలింపు ఈజిప్ట్, ఇజ్రాయెల్ మరియు హమాస్‌లతో కూడిన కతార్ మధ్యవర్తిత్వ ఒప్పందం ఫలితంగా వచ్చింది.
:ఇజ్రాయెల్ సరిహద్దుకు సమీపంలోని నిరిమ్ కిబ్బట్జ్ ప్రాంతంలో మరో సీనియర్ హమాస్ కమాండర్ బిల్లాల్ అల్-ఖేద్రాను హతమార్చినట్లు ఇజ్రాయెల్ వైమానిక దళం ఆదివారం తెలిపింది. ఇజ్రాయెల్ ఫైటర్ జెట్లు కిబ్బట్జ్ నిరిమ్ ఊచకోతకు కారణమైన దక్షిణ ఖాన్ యునిస్‌లోని దళాల నుఖ్బా కమాండర్ బిల్లాల్ అల్ కేద్రాను గత రాత్రి చంపాయి.