Published On:

Trump on India Pakistan War: యుద్ధం ముగిసింది.. ట్రంప్ కీలక ప్రకటన!

Trump on India Pakistan War: యుద్ధం ముగిసింది.. ట్రంప్ కీలక ప్రకటన!

Trump Posted in X that India Pakistan Agreed for Ceasefire: పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్ ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా భారత్ సైనిక చర్యలకు దిగింది. భారత్ దాడులపై పాకిస్తాన్ భారత్ పైకి డ్రోన్లు, మిస్సైళ్లతో దాడులకు దిగింది. భారత్ లోని సరిహద్దు రాష్ట్రాలే లక్ష్యంగా పాకిస్తాన్ జరిపిన దాడులను భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టింది. మరోవైపు భారత్ లోని ఉగ్రవాద, సైనిక స్థావరాలే లక్ష్యంగా భారత దళాలు దాడులు చేశాయి. పాకిస్తాన్ కు భారీ నష్టాన్ని కలిగించాయి. దీంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు మరింతగా పెరిగాయి.

 

ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన చేశారు. భారత్- పాక్ కాల్పుల విరమణకు అంగీకరించాయని పేర్కొన్నారు. అందుకు అమెరికా మధ్యవర్తిత్వం చేసిందని స్పష్టం చేశారు. సుదీర్ఘ చర్చల తర్వాత భారత్, పాకిస్తాన్ పూర్తిస్థాయిలో కాల్పుల విరమణకు అంగీకరించాయని స్పష్టం చేశారు. ఈ సందర్భంలో ఇరుదేశాలు ఎంతో వివేకంతో ఆలోచించాయని.. అందుకు రెండు దేశాలకు అభినందనలు తెలుపుతున్నట్టు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ప్రకటనతో భారత్- పాక్ మధ్య యుద్ధం ముగిసిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

 

Image