Published On:

Donald Trump: ట్రంప్‌ను చంపేస్తాం.. ఎఫ్‌బీఐ మాజీ డైరెక్టర్ బెదిరింపులు!

Donald Trump: ట్రంప్‌ను చంపేస్తాం.. ఎఫ్‌బీఐ మాజీ డైరెక్టర్ బెదిరింపులు!

Ex FBI chief murder threat post in instagram to Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను చంపేస్తామని ఎఫ్‌బీఐ మాజీ డైరెక్టర్ జేమ్స్ కామీ బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా బెదిరింపులు చేసినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో దేశవ్యాప్తంగా కలకలం రేగింది. అంతేకాకుండా, ఆయన ‘86 47’ వర్డ్‌తో ఇన్‌స్టాలో పోస్ట్ చేయడంతో పాటు కాసేపటికే వాటిని డిలీట్ చేశాడు. అయితే అప్పటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రస్తుతం ఈ బెదిరిపులపై తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంపై దర్యాప్తు చేపడుతున్నట్లు హోం ల్యాండ్ సెక్యూరిటీ కార్యదర్శి క్రిస్టి నోయెమ్ వెల్లడించారు.

 

అయితే, ఇన్‌స్టా వేదికగా జేమ్స్ కామీ తొలుత ‘86 47’ పదాలను పోస్ట్ చేశాడు. ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ వెంటనే డిలీట్ చేశాడు. ఈ నంబర్‌పై వివరాలను ఆరా తీయగా.. 86 అంటే తొలగించడం అని అర్ధం వస్తుండగా.. 47 అనగా ట్రంప్ అమెరికా దేశానికి 47వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశాడు. దీంతో ట్రంప్‌ను పరోక్షంగా చంపడం లేదా వైదొలగేలా చేయడం అనే అర్ధం వచ్చేలా పిలుపు ఇచ్చారని సోషల్ మీడియా కూత కూసింది.

 

తాజాగా, ఈ విషయంపై మాజీ ఎఫ్‌బీఐ డైరెక్టర్ జేమ్స్ కామీ స్పందించారు. బీచ్ వాక్ చేస్తున్న సమయంలో ఓ షెల్‌ల చిత్రం కనిపించగా.. ఇన్‌స్టాలో పోస్ట్ చేశానని చెప్పారు. అంతకానీ ఆ పోస్ట్ వెనక ఇలా ఉంటుందని అనుకోలేదని, కావాలనే అధికారులు తప్పుడు అర్ధం చేసుకుంటున్నారన్నారు. ఈ నంబర్‌ను హత్య కోసం ఉపయోగిస్తున్నారనే విషయం తెలియదన్నారు. నేను ఎందుకు ట్రంప్‌ను చంపుతానని, అలాంటి ఉద్ధేశం లేదన్నారు. హింస అంటే తనకు ఇష్టం ఉండదని చెప్పుకొచ్చాడు.

 

ఇదిలా ఉండగా, జేమ్స్ కామీ అమెరికాలో లాయర్‌గా పనిచేశారు. ఆ వెంటనే ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్‌గా చేశారు. గతంలో 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్ వివాదంలో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ దర్యాప్తులో ఆయన కీలక పాత్ర పోషించడంతో వివాదాస్పదంగా మారింది. ఆ తర్వాత 2017లో జేమ్స్ కామీని పదవి నుంచి ట్రంప్ తొలగించారు.