Published On:

IMF: ఐఎంఎఫ్ నుంచి మరోసారి రుణం.. పండగ చేసుకుంటున్న పాక్

IMF: ఐఎంఎఫ్ నుంచి మరోసారి రుణం.. పండగ చేసుకుంటున్న పాక్

Pakistan: తీవ్ర ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న పాకిస్తాన్ కు మరో మంచి అవకాశం వచ్చింది. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (ఐఎంఎఫ్) నుంచి రెండో విడతలో 1023 మిలియన్ డాలర్లు రుణం.. భారత కరెన్సీ ప్రకారం రూ. 8,500 కోట్లు అందాయి. ఈ విషయాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు తన ఎక్స్ అకౌంట్ లో పోస్ట్ చేసింది.

 

కాగా దేశ అవసరాల కోసం పాకిస్తాన్ మొత్తం రూ. 20 వేల కోట్ల రూపాయాలను రుణంగా ఇవ్వాలని కోరింది. అందులో రూ. 8,500 కోట్ల నిధులు ఎక్స్ టెండెడ్ ఫండ్ ఫెసిలిటీ కింద ఐఎంఎఫ్ మంజూరు చేసింది. మరో 11,620 కోట్లు వాతావరణ మార్పులకు సంబంధించిన మౌలిక వసతుల అభివృద్ధి కోసం కేటాయించినట్లు పేర్కొంది.

 

అయితే పాకిస్తాన్ కు రుణం ఇవ్వాలనుకున్న ఐఎంఎఫ్ నిర్ణయంపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ నిధులను పాకిస్తాన్ మళ్లీ ఉగ్రవాద చర్యలకు వినియోగించే అవకాశం ఉందని, ఇప్పటికే భారత్ ఉగ్రవాదంపై పోరాటం సాగిస్తున్న వేళ ఇలాంటి ఆర్థిక సహాయం అందజేస్తే పాకిస్తాన్ మరింత రెచ్చిపోయే అవకాశం ఉందని భారత్ హెచ్చరించింది. అయినా ఐఎంఎఫ్ పాకిస్తాన్ కు నిధులు మంజూరు చేసింది. తాజాగా ఆ రుణం పాకిస్తాన్ విదేశీ మారక నిల్వలకు చేరాయి.