Earthquake In Myanmar: మయన్మార్‌లో భయంకర పరిస్థితులు.. 2,700కు చేరిన మృతుల పంఖ్య

Earthquake In Myanmar death still 2700 peoples: మయన్మార్‌లో భయంకర పరిస్థితులు నెలకొన్నాయి. ఆ దేశాన్ని భూకంపం అతలాకుతలం చేసింది. ఇటీవల వచ్చిన భూకంపం రిక్టార్ స్కేలుపై 7.7 తీవ్రత నమోదైంది. ఈ భారీ భూకంపంతో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆ తర్వాత కూడా భూమి పలుమార్లు కంపించింది. దీంతో దేశంలో ఎటూ చూసిన విధ్వంసమే కనిపిస్తుంది.
ఈ ప్రకృతి విలయతాండవం కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 2,700కు చేరింది. ఇప్పటి వరకు 4,500 మంది గాయపడ్డారు. భూకంపం కారణంగా 441 మంది ఆచూకీ గల్లంతైంది. గల్లంతైన వారి కోసం గాలిస్తుండగా.. సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి.
మయన్మార్‌లో సంభవించిన ఈ భూకంప ప్రభావం పొరుగు దేశాలపై చైనా, థాయ్ లాండ్ తదితర దేశాలపై కూడా పడింది. ఆ దేశాలలో కూడా భూకంపం సంభవించింది. ఇదిలా ఉండగా, మయన్మార్‌ను ఆదుకునేందుకు భారత్ ముందుకొచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఆ దేశానికి అవసరమైన సాయాన్ని భారత్ పంపించింది.