Last Updated:

America: సీన్‌ రివర్స్‌.. ఇతర దేశాల పౌరసత్వం కోసం క్యూ కడుతున్న అమెరికా పౌరులు!

America: సీన్‌ రివర్స్‌.. ఇతర దేశాల పౌరసత్వం కోసం క్యూ కడుతున్న అమెరికా పౌరులు!

Americans are buying second passports: ప్రపంచంలోని ప్రతి దేశానికి చెందిన పౌరుడు అమెరికాలో స్థిరపడాలని కలలు కంటాడు. అమెరికా పౌరసత్వం లభించిందంటే జన్మధన్యమైందని భావిస్తాడు. మరి అలాంటిది అమెరికా పౌరులే ఇతర దేశాలకు పౌరసత్వం కోసం పోటీ పడుతున్నారు. రెండవ పాస్‌పోర్టు కోసం క్యూ కడుతున్నారు.

అమెరికా పౌరసత్వం కోసం పోటీ అంతా ఇంతా కాదని యావత్‌ ప్రపంచానికి తెలుసు. కొందరు సక్రమ మార్గం ద్వారా వెళితే.. మరి కొందరు అక్రమ మార్గం ద్వారా వెళుతుంటారు. అలాంటిది ప్రస్తుతం సీన్‌ రివర్స్‌ అయ్యింది. ఇక అమెరికా పౌరులే ఇతర దేశాలకు పౌరసత్వం కోసం క్యూ కడుతున్నారు. రెండవ పాస్‌పోర్టు కోసం యత్నిస్తున్నారు. దీనికి కారణం కూడా బహిరంగ రహస్యమే. అమెరికాలో రాజకీయ, ఆర్థిక అనిశ్చిత పరిస్థితి ఒకటైతే.. మరోటి ట్రంప్‌ రోజుకో కొత్త ఆర్డర్‌ తెచ్చి అమెరికన్‌లనే భయకంపితులను చేస్తున్నాడు. దీంతో ఇతర దేశాల పౌరసత్వం కోసం పోటీపడుతున్నారు. ఇతర దేశాల్లో పౌరసత్వం తీసుకొని భవిష్యత్తు భద్రతకు ప్లాన్‌ చేసుకుంటున్నారు.దీనికి ఉదాహరణగా చెప్పుకోవాలంటే సిటిజన్‌షిప్‌ అండ్‌ రెసిడెన్సీ అడ్వయిజరీ సంస్థ లాటిట్యూడ్‌ గ్రూపు ఆర్డోన్‌ క్యాపిటల్‌ కొన్ని ఉదాహరణలు చెబుతోంది. ఇటీవల కాలంలో అమెరికా పౌరులు రెండవ పాస్‌పోర్టు కోసం లేదా దీర్ఘకాలంగా ఇతర దేశాల్లో స్థిరనివాసం ఏర్పాటు కోసం యత్నించే వారి సంఖ్య రోజు రోజుకు గణనీయంగా పెరిగిపోతోందని తెలిపింది. కావాలనుకుంటే పెట్టుబడులు పెడుతామని.. లేదా ఇతర ఏ దైనా స్కీంలుంటే వాటి ద్వారా ఆ దేశంలో అడుగుపెడతామని అమెరికన్లు ముందుకొస్తున్నారు. కాగా ట్రంప్‌ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీరించిన తర్వాత దేశం నుంచి ఇతర దేశాలకు వలసవె ళ్లడానికి తమను చాలా మంది సంప్రదించారని చెబుతోంది లాటిట్యూడ్‌ గ్రూపు.

ఈ ఏడాది మొదటి మూడు నెలల కాలంలోనే యూఎస్‌ క్లయింట్లు నుంచి 400 శాతం డిమాండ్‌ పెరిగిందని లాటిట్యూడ్‌ వెల్లడించింది. అదే 2020 నుంచి చూస్తే ఏకంగా వెయ్యి శాతం పెరిగిందని వివరించింది. అయితే రెండవ పాస్‌పోర్టు కోసం దరఖాస్తులు చేస్తున్నట్లు అమెరికా ప్రభుత్ం వద్ద అధికారిక రికార్డు లేదు. అయితే విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం గత కొన్ని సంవత్సరాల నుంచి రెండవ పాస్‌పోర్టు కోసం గ్లోబల్‌ అప్లికేషన్స్‌ పది వేల వరకు వస్తే.. వాటిలో 4వేలు అమెరికన్ల నుంచే వచ్చాయని చెబుతున్నారు. ఇక అమెరికన్‌ పౌరుల విషయానికి వస్తే కరోనా తర్వాత నుంచి రెండవ పాస్‌పోర్ట్‌ కోసం దరఖాస్తు చేసుకొనే వారి సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. ట్రంప్‌ అధకారంలోకి వచ్చిన తర్వాత అమెరికాకు చెందిన బిలియనీర్లు, అతి పెద్ద బిజినెస్‌ యాజమానులు, కొంత మంది నిపుణులు ..రాజకీయ నాయకులు ప్లాన్‌ బీ ని సిద్దం చేసుకొని దేశం నుంచి వీలైనంత త్వరగా నిష్ర్కమించాలని చూస్తున్నారు. అమరికాలో ఇక ఏ మాత్రం నివసించలేమనే స్థాయికి వచ్చారు.. ముందుస్తుగానే రెండవ పాస్‌పోర్టు తీసుకొని పెట్టుకుంటేనే సెఫ్‌.. చివరి క్షణంలో పాస్‌పోర్టు కోసం యత్నించడం వల్ల ప్రయోజనం ఉండదని తమ క్లయింట్లు భావిస్తున్నారని లాటిట్యూడ్‌ గ్రూపు మేనేజింగ్‌ పార్లనర్ క్రిస్టఫర్‌ విల్లీస్‌ వివరించారు.

ఇక పాస్‌పోర్టుల విషయానికి వస్తే చాలా దేశాలు …తమ దేశంలో ఇన్వెస్ట్‌ చేస్తే మీకు పౌరసత్వం ఇస్తామని.. గోల్డెన్‌ వీసా ప్రోగ్రాం అంటూ ఇన్వెస్టర్లను ఆకర్షిస్తున్నాయి. పలు దేశాలు తమ దేశంలో రియల్‌ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెడితే లేదా తమ దేశాభివృద్దికి డొనేషన్స్‌ రూపంలో ప్రభుత్వ బాండ్లు కొనుగోలు చేస్తే పౌరసత్వం ఇస్తామని ఆఫర్లు చేస్తున్నాయి. ఇక ఈ ఇన్వెస్ట్‌మెంట్ల విషయానికి వస్తే అతి తక్కువ రేంజి అంటే పది వేల డాలర్ల నుంచి గరిష్టంగా ఒక మిలియన్‌ యూరోల వరకు పెట్టుబుడులు పెట్టే వారికి పౌరసత్వం ఇవ్వడానికి చాలా దేశాలు సుముఖంగా ఉన్నాయి. ఇక రెసిడెన్సీ బై ఇన్వెస్ట్‌మెంట్‌ స్కీంల విషయానికి వస్తే పోర్చుగల్‌ గోల్డెన్‌ వీసా లేదా గ్రీస్‌లో అలాంటి స్కీం అందుబాటులో ఉంది. కొన్ని లాంగ్‌టర్మ రెసిడెన్సీ స్కీంలతో పాటు కొన్ని స్కీంల విషయానికి వస్తే యూరోజోన్‌లొని షెన్‌జాన్‌ ఏరియాలో ప్రయాణించడానికి అనుమతిస్తున్నాయి. అయితే పౌరసత్వం మాత్రం ఇవ్వదు. ఇక పోర్చుగల్‌ విషయానికి వస్తే ఐదు సంవత్సరాలపాటు ప్రతి రెండేళ్లకు సరాసరి 14 రోజుల పాటు దేశంలో నివాసం ఉంటే వారికి ఆ దేశ పౌరసత్వం లభిస్తుంది.

సిటిజన్‌షిప్‌ బై ఇన్వెస్ట్‌మెంట్‌ స్కీం విషయానికి వస్తే మాల్టాతో పాటు పలు కరేబియన్‌ దేశాలు ఆఫర్‌ చేస్తున్నాయి. ఈ దేశాలు 16 నెలల్లో పాస్‌పోర్టు జారీ చేస్తాయి. ఇక అమెరికాకు చెందిన లాటిట్యూడ్‌ సమాచారం ప్రకారం 50 శాతం అమెరికన్‌ క్లయింట్లు ప్రస్తుతం పోర్చుగల్‌లోని గోల్డెన్‌ వీసానే అత్యధికంగా ఎంచుకుంటున్నారు. అటు తర్వాత మాల్టాకు 25 శాతం, కరేబియన్‌ నేషన్స్‌కు 15 శాతం మంది తమ మకాం మార్చుకోవాలనుకుంటున్నారు. అయితే రెండవ పాస్‌పోర్టు తీసుకున్న వారిలో 80 శాతం మంది తక్షణమే తాము దేశం నుంచి నిష్ర్కమించడం లేదని.. అయితే పరిస్థితులు అనుకూలించనప్పుడు సెకండ్‌ ఆప్షన్‌గా రెండవ పాస్‌పోర్టును సిద్దం చేసి పెట్టుకున్నామని చెబుతున్నారు. అయితే కొన్ని దేశాలు పౌరసత్వం కావాలనుకుంటే తమ తదుపరి వారుసులకు కూడా వర్తించేలా అంటే పిల్లలు, మనవలు, మనవరాళ్లకు కూడా పౌరసత్వం కల్పించే సదుపాయం కూడా అందుబాటులో ఉంచింది.

ఇక సెకండ పాస్‌పోర్టుకు ఎవరు దరఖాస్తు చేసుకుంటున్నారనే విషయానికి వస్తే…. బిలయనీర్లతో పాటు హైనెట్‌ వర్త్‌ బిజినెస్‌ ఓనర్స్‌ ఎక్కువగా ఉన్నారు. ఇదిలా ఉండగా పోలండ్‌ ప్రధాన కార్యాలయంగా పనిచేస్తన్న ఇంటర్నేషనల్‌ టాక్స్‌ అండ్‌ ఇమ్మిగ్రేషన్‌ అడ్వయిజర్‌ డేవిడ్‌ లెస్పరెన్స్‌ సమాచారం ప్రకారం తన అమెరికన్‌ క్లయింట్లు .. వారిలో ఎల్‌జీబీటీక్యూ ఇండివ్యూడివల్స్‌, అతి పెద్ద పార్టీలకు విరాళాలు ఇచ్చే వారు ఉన్నారని చెప్పారు. .. అమెరికా ప్రభుత్వం ప్రజలపై ఆధిపత్యం ధోరణి చూపిస్తోందని భావించే వారు అమెరికాను వీడి బయటకు రావాలనుకుంటున్నారని తెలిపారు. గతంలో ఎన్నడూలేని విధంగా తాను ప్రస్తుతం బిజీ అయ్యాను. గతంలో ఎన్నడూ అమెరికా వీడొద్దు అనుకునే వారు సడెన్‌ అమరికాను వీడాలని సీరియస్‌గాఆలోచిస్తున్నారని డేవిడ్‌ అంటున్నారు. కాగా గోల్డెన్‌ పాస్‌ పోర్టు రచయిత ప్రొఫేసర్‌ క్రిస్టిన్‌ సురాక్‌ కూడా .. అమెరికా పౌరులు దేశం వీడి ఇతర దేశాలకు వెళ్లడానికి ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. ఆమెరికాలో పరిస్థితులు అనుకూలంగా లేనందువల్ల వారు తమ భద్రత కోసం సెకండ్‌ సిటిజన్‌ షిప్‌ తీసుకుంటున్నారని వివరించారు.

ఇక లాటిట్యూడ్‌ గ్రూపు చెప్పేది ఏమిటంటే గతంలో చైనా, ఇండియాకు చెందిన వారు తమకు రెండవ పాస్‌పోర్టు లేదా పౌరసత్వం కోసం తమను సంప్రదించే వారు అలాంటిది ప్రస్తుతం అమెరికన్లు పెద్ద సంఖ్యలో వస్తున్నారని విల్లీస్‌ చెప్పారు. వీరు సెకండ్‌ సిటిజన్‌ షిప్‌ కోసం ఎందుకు దరఖాస్తు చేస్తున్నారంటే ట్రంప్‌ పోకడలు వీరికి నచ్చడం లేదు. ఆయన రోజుకో ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌ జారీ చేస్తూ పౌరహక్కులకు భంగం కలిగిస్తున్నారు. వలసదార్లకు ప్రొటెక్షన్‌ ఇవ్వడం లేదు. మైనార్టీల హక్కులను కాలరాస్తున్నారని చాలా మంది ట్రంప్‌ ప్రభుత్వంపై అసంతృప్తి వెళ్లగక్కారు. కొంత మంది… ట్రంప్‌ కాష్‌ పటేల్‌ను ఎఫ్‌బీఐ చీఫ్‌గా చేసి రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతాడేమో అన్న భయంతో దేశం వీడిపోవాలనుకుంటున్నారు. అలాగే అమెరికాలోని యూనివర్శిటీ క్యాంపస్‌లో పాలస్తీనా అనుకూల విద్యార్థులపై దమన కాండనుకూడా చాలా మంది ప్రస్తావిస్తున్నారు. మరి కొందరు తరచూ ప్రకృతి విపత్తులు సంభవించడంతో పాటు కాలిఫోర్నియా కార్చిచ్చు. మాస్‌ షూటింగ్‌లు, వర్ణ వివక్ష పెరిగిపోయిందని.. రాజకీయంగా చురుకుగా ఉంటే వారిని వేధించడం ఇవన్నీ చూస్తే సగం అమెరికా మనల్ని నచ్చడం లేదనే కదా అని చాలా మంది ఇతర దేశాలవైపు చూస్తున్నారు.

ఇక లాటిట్యూడ్‌ క్లయింట్ల విషయానికి వస్తే వెస్టీండీస్‌లోని ఆంటిగ్వా, బార్బుడాస్‌లో 3 లక్షల డాలర్లు ఇన్వెస్ట్‌ చేసి స్థిరాస్థి కొనుగోలు చేసి పౌరసత్వం దక్కించుకోవచ్చు. ఫ్లోరిడాలో వేకేషన్‌ హోం కొనుగోలు చేయడం కంటే అక్కడ ఇన్వెస్ట్‌ చేసి పాస్‌పోర్టు దక్కించుకోవడం మేలనుకుంటున్నారు. అలాగే యూఏఈ కూడా గోల్డెన్‌ వీసా పేరుతో 5.45 లక్షల డాలర్లు ఇన్వెస్ట్‌ చేసి రియల్‌ ఎస్టేట్‌ కొనుగోలు చేయడమో లేదా ఏదైనా ఫైనాన్షియల్‌ ఇన్సిస్టిట్యూట్‌లో డిపాజిట్‌ చేస్తే వారికి పౌరసత్వం ఇస్తోంది. దీంతో పాటు అమెరికా పౌరులకు ఆదాయపు పన్న పెద్ద తలనొప్పిగా మారింది. అమరికా పౌరసత్వం ఉండి అతడు విదేశాల్లో వ్యాపారం చేసి అక్కడ సంపాదించుకున్నా.. అక్కడ పన్నులు కట్టినా.. అమెరికాలో మాత్రం తప్పకుడా టాక్స్‌ రిటర్న్స్‌ ఫైల్‌ చేయాల్సి వస్తుంది. గ్లోబల్‌ ఇన్‌కంపై టాక్స్‌ కట్టాల్సిఉంటుంది. ఇది అమరికా పౌరుడితో పాటు గ్రీన్‌కార్డు హోల్డర్స్‌కు వర్తిస్తుంది. ఇక అసలు విషయానికి వస్తే 2024లో అమెరికాలో ఎన్నికల కంటే ముందే 53 శాతం అమెరికన్‌ మిలియనీర్లు విదేశాలకు వెళ్లి స్థిరనివాసం ఏర్పర్చుకోవాలని సీరియస్‌గా ఆలోచించారట. ప్రస్తుతం ట్రంప్‌ ప్రభుత్వంపై విసుగు చెందిన అమెరికన్లే త్వరగా దేశం దాటిపోవడమే మేలని స్థాయికి వచ్చారు. పరిస్థితి ఇలా ఉంటే త్వరలోనే అమెరికా ఖాళీ అయినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదంటున్నారు ఇమ్మిగ్రేషన్‌ ఎనలిస్టులు.. మరి ట్రంప్‌కు ఇది వేకప్‌ కాల్‌ అవుతుందా .. వేచి చూడాల్సిందే.