Published On:

Donald Trump: అక్రమ వలసలకు చెక్.. ట్రంప్ కొత్త వ్యూహం

Donald Trump: అక్రమ వలసలకు చెక్.. ట్రంప్ కొత్త వ్యూహం

America: దేశంలోకి అక్రమ వలసలను అరికట్టేందుకుగాను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సరికొత్త వ్యూహాన్ని ఎంచుకుంటున్నారు. ఈ మేరకు భారత్ సహా పలు దేశాల విద్యార్థులను అమెరికా నుంచి పంపించేందుకు చర్యలు తీసుకుంటోంది. అయితే ఈ సరికొత్త ప్రణాళికతో విదేశీ విద్యార్థులకు మరిన్ని చిక్కులు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ట్రంప్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయంతో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు మార్గదర్శకాలను రూపొందిస్తోంది. ఈ నిర్ణయంతో అమెరికా పౌరులకు విద్యా, ఉద్యోగాల్లో అవకాశాలు లభిస్తాయని అమెరికా భావిస్తోంది.

కాగా ఇప్పటివరకు అమెరికాలో చదువుతూ వారి వీసాలు రద్దైనా వారు అమెరికాలో ఉండేందుకు అక్కడి అధికారులు వారి చదువు పూర్తి చేసేందుకు, అక్కడే ఉండేందుకు అనుమతించేవారు. కానీ ప్రస్తుతం ట్రంప్ సర్కార్ తీసుకువస్తున్న కొత్త అడ్మినిస్ట్రేషన్ వ్యూహంతో ఇక అలాంటి విధానం అమలుకాదు. ఏదైనా కారణంచేత విద్యార్థి వీసాను రద్దు చేస్తే అతడు అమెరికాలో చదువుకునే అవకాశాన్ని కోల్పోతాడు. నిబంధనల ప్రకారం విద్యార్థి ఎలాంటి తప్పులు చేయకపోయినా నేరస్థునిగా పరిగణిస్తారు. అతని పేరును క్రిమినల్ షీట్ లో నమోదు చేస్తారు. అలాగే దేశం నుంచి వెంటనే బహిష్కరిస్తారు. ఈ విషయమై ట్రంప్ సర్కార్ కొత్త మార్గదర్శకాలను కోర్టుకు వివరించింది.