Published On:

Trump: సినిమా రంగానికి ట్రంప్ షాక్.. విదేశీ సినిమాలపై 100% ట్యాక్స్

Trump: సినిమా రంగానికి ట్రంప్ షాక్.. విదేశీ సినిమాలపై 100% ట్యాక్స్
  • సినిమా రంగానికి ట్రంప్ షాక్
  • విదేశీ సినిమాలపై 100% ట్యాక్స్

 

Trump: డోనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత వాణిజ్య రంగంలో పెను మార్పులు తీసుకొచ్చారు. విదేశీ వస్తువుల మీద ట్యాక్సులు పెంచారు. ప్రస్తుతం సినీ రంగంపై ఆయన చూపు పడింది. విదేశాలలో నిర్మించబడిన అన్ని సినిమాలపై 100శాతం ట్యాక్స్ ను విధిస్తున్నట్లు ప్రకటించారు. ఇది వెంటనే అమలులోకి వస్తుందన్నారు. “WE WANT MOVIES MADE IN AMERICA, AGAIN!” Trump added. అమెరికాలో సినిమాలు తీయాలన్నదే తమ అభిమతమన్నారు.

 

ఇందులో భాగంగానే తన స్వంత సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం అయిన ట్రూత్ సోషల్ లో ట్రంప్ పోస్ట్ చేశారు. కుప్పకూలుతున్న అమెరికా పరిశ్రమకు తన నిర్ణయం ఊపిరిలూదుతుందన్నారు. ఇతర దేశాలు అమెరికాలో సినిమాలను నిర్మించాలనే లక్ష్యంతోనే ట్యాక్స్ ను విధించినట్లు తెలిపారు. అమెరికా చలనచిత్ర, టెలివిజన్ రంగాలు గత దశాబ్దకాలంలో 40శాతం అభివృద్ధిని కోల్పోయిందన్నారు.

 

యూఎస్ బాక్సాఫీస్ వసూళ్లు 2018లో 12బిలియన్ డాలర్ల కంటే తక్కువగా ఉండగా, కోవిడ్ సమయంలో అనేక థియేటర్లు మూసివేయబడ్డాయి. ఆతర్వాత సినీ రంగం అంతగా పుంజుకోలేదు. యూఎస్ బాక్సాఫీస్ వసూళ్లు 9బిలియన్ డాలర్లు దాటలేదు. ప్రస్తుత ట్యాక్స్ విధానం అమెరికా సినీ రంగానికి ఎంతో మేలుచేస్తుందన్నారు ట్రంప్. నెట్ ఫ్లిక్స్, డిస్నీ లాభాలు ఆర్జించడానికి చాలా కాలం పట్టిందన్నారు.

 

 

విదేశాలలో తయారైన వస్తువులపై ట్రంప్ ఇప్పటికే అధిక ట్యాక్స్ లను విధించారు. అందులో భాగంగానే చైనా వస్తువులపై 145శాతం దిగుమతి సుంకాన్ని విధించారు. అందుకు బదులుగా చైనా అమెరికా ఉత్పత్తులపై 125శాతం ట్యాక్స్ ను విధించింది. కెనగా, మెక్సికో నుంచి వచ్చే ఉక్కు, అల్యూమినియం, ఆటోలు, విడిభాగాలపై 25శాతం ట్యాక్స్ ను విధించారు. కెనడా దిగుమతులపై ఏకంగా 145శాతం ట్యక్స్ ను విధించారు.

 

 

ఇవి కూడా చదవండి: