Sidney: 2500 మందితో నగ్న ఫోటోషూట్.. ఎందుకో తెలుసా..?
ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఉన్న బాండీ బీచ్ వద్ద ఇవాళ ఉదయం జరిగిన సన్నివేశాన్ని చాలా మంది ప్రజలు తప్పుగా భావిస్తుంటారు. కానీ అది ఎంతో మందికి ఆదర్శం మరియు ఆరోగ్య సంరక్షణపై అవగాహణ పెంచేందుకు సుమారు 2500 మంది నగ్న ఫోటోషూట్‌లో పాల్గొనడం అనేది ఎంతో గొప్పదైన చర్య.
Sidney: ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఉన్న బాండీ బీచ్ వద్ద ఇవాళ ఉదయం జరిగిన సన్నివేశాన్ని చాలా మంది ప్రజలు తప్పుగా భావిస్తుంటారు. కానీ అది ఎంతో మందికి ఆదర్శం మరియు ఆరోగ్య సంరక్షణపై అవగాహణ పెంచేందుకు సుమారు 2500 మంది నగ్న ఫోటోషూట్‌లో పాల్గొనడం అనేది ఎంతో గొప్పదైన చర్య.
చర్మ క్యాన్సర్‌పై అవగాహన కల్పించే ఉద్దేశంతో వాటంరీలుగా దాదాపు 2500 మంది స్త్రీపురుషులు ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అమెరికా ఫోటోగ్రాఫర్ స్పెన్సర్ టునిక్ ఈ ప్రాజెక్టు చేపట్టారు. ఇంతకీ ఎందుకు ఈ ప్రాజెక్ట్ చేపట్టారంటే..
ఆస్ట్రేలియాలో స్కిన్ క్యాన్సర్ బాధితులు ఎక్కువ. అయితే అక్కడ ప్రజల్లో అవగాహన చర్మ క్యాన్సర్ పై అవగాహణ తక్కువ దానితో ప్రతిఏటా వందలాది మంది ఈ క్యాన్సర్ బారిన పడి మృతిచెందుతున్నారు. దానితో ప్రజలకు అవగాహణ కల్పించాలన్న ఉద్దేశంతో ఈ ఈవెంట్ నిర్వహించారు. బీచ్‌ల్లో నగ్నంగా తిరిగేందుకు ఇటీవల కాలంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం చట్టం చేసింది. “స్కిన్ చెకప్స్ గురించి అవగాహన పెంచడానికి నాకు అవకాశం ఉంది మరియు ఈ షూట్ ద్వారా కేవలం శరీరాన్ని మరియు రక్షణను గురించి ప్రజలకు అవగాహన కల్పించడంలో నా పాత్ర ఉండడాన్ని నేను గౌరవంగా ఫీల్ అవుతున్నానని టునిక్ పేర్కొన్నారు.
ఈ సంవత్సరం ఆస్ట్రేలియాలో 17,756 కొత్త చర్మ క్యాన్సర్ కేసులు నిర్ధారణ అవుతాయని, 1,281 మంది ఆస్ట్రేలియన్లు ఈ వ్యాధితో చనిపోతారని ఫెడరల్ ప్రభుత్వం అంచనా వేసింది.
ఇదీ చదవండి: గూగుల్లో ఈ ఏడాది ఎక్కువ మంది వెతికింది ఈమెనే..!